స్వభావ్ స్వచ్ఛత – సంస్కార్ స్వచ్ఛత తో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలి
జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
స్వచ్ఛత అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలి
: మున్సిపల్ కమీనర్ ఎన్.మౌర్య
Cleanliness is everyone’s responsibility
తిరుపతి
ప్రతి ఒక్కరు స్వభావ్ స్వచ్ఛత – సంస్కార్ స్వచ్ఛత పై అవగాహనతో పాటు భాగస్వామ్యం ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్.వేంకటేశ్వర్ తెలిపారు.
బుధవారం ఉదయం స్థానిక కచ్చపి ఆడిటోరియం నందు మున్సిపల్ కార్పొరషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా హి సేవా -2024 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ఎస్.వేంకటేశ్వర్, ఎం.ఎల్.సి సిపాయి సుబ్రహ్మణ్యం, మాజీ ఎం.ఎల్.ఏ సుగుణమ్మ, మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య సంబందిత అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంబించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ స్వభావ్ స్వచ్ఛత – సంస్కార్ స్వచ్ఛత పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రతి అక్టోబర్ 2 తేదిన గాంధీ జయంతి ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో అనుసందానం చేసుకుంటూ స్వచ్చతా హి సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం మూడు నాలుగు రోజులు జరిగే కార్యక్రమం ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా రెండు వారాల ముందు నుండి మొదలు పెట్టి ప్రతి రోజు కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కృష్ణా జిల్లాలో స్వచ్చతాహి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు.
తిరుపతి కార్పోరేషన్ పరిధిలో చాలాకాలంగా పేరుకపోయిన చెత్తను టార్గెట్ లాగా పెట్టుకొని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు ప్రణాళిక బద్దంగా కమిషనర్ చొరవతో తిరుపతి పట్టణాన్ని శుబ్రంగా పెట్టుకోవడం జరిగిందని తెలిపారు. తిరుచానూరు పంచాయతీ లో రోడ్డు పక్కన దాదాపు 60 అడుగుల వెడల్పు, అర కిలోమీటరు పొడవు, 15 అడుగుల ఎత్తులో గత 30 సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్తను గుర్తించి స్వచ్చతాహి సేవా కార్యక్రమం లో భాగంగా స్పెషల్ డ్రైవ్ క్రింద తీసుకొని సుమారు 2015టన్నుల చెత్తను 600 లోడ్ లను ట్రాక్టర్ ల ద్వారా తొలగించి ఆ స్థలమును మినీ పార్కు గా ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. దీనివలన చుట్టుప్రక్కల నివసించే ప్రజలు సంతోషం వ్యక్తపరిచారని తెలిపారు.




