ఏపీ నిట్ లో ఘనంగా స్వచ్ఛతా పక్వాడ

- Advertisement -

ఏపీ నిట్ లో ఘనంగా స్వచ్ఛతా పక్వాడ

Cleanliness is great in AP nit

తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 13
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ (ఏపీ నిట్ )లోని ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లబ్, ప్రయత్నం క్లబ్, టాస్క్ ఫోర్స్ క్లబ్, బృందావనం క్లబ్ లు సంయుక్తంగా స్వచ్ఛతా పక్వాడ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించాయి. ఏపీ నిట్ ఇన్చార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్.మూర్తి ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రాంగణంలోని అకడమిక్ భవనాలు, క్యాంటీన్, ఇండోర్ స్టేడియం, నిట్ ముఖద్వారం పరిసరాలలోని ప్లాస్టిక్ వ్యర్థాలను, చెత్తాచెదారాన్ని విద్యార్థులు తొలగించి శుభ్రం చేశారు. ముందుగా పరిపాలనా భవనం నుంచి నిట్ తూర్పు ముఖద్వారం వరకు ప్రదర్శన నిర్వహించారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై అవగాహనను కలిగి ఉండాలని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్లో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సాస్ అసిస్టెంట్ లు డాక్టర్ శ్రీనివాస్, సంధ్యారాణి, క్లబ్ కార్యదర్సులు బి.తరుణ్, జగదీష్, మల్లికార్జున్, ఎం.సాయి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular