17 రోజుల్లో క్లూలెస్ హత్య కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్.
– శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో క్లిష్టమైన హత్య కేసును ఛేదించిన తిరుపతి రూరల్ పోలీసులు.
– సీసీ కెమెరాలు, ANPR, CDR విశ్లేషణతో నిందితుడిని గుర్తించిన ప్రత్యేక బృందం.
– మృతురాలిని వేలూరి భాగ్యశ్రీ (26)గా గుర్తింపు.
– రొంపిచెర్ల క్రాస్ వద్ద నిందితుడి అరెస్ట్.
– ఆటో, రెండు సెల్ఫోన్లు, రూ.450 నగదు స్వాధీనం.
– దర్యాప్తు బృందాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ.
‘Clueless’ murder case solved in 17 days – suspect arrested.
తిరుపతి, నవంబర్ 17: తిరుపతి రూరల్ పోలీసులు 17 రోజుల్లోనే క్లూలెస్ హత్య కేసును విజయవంతంగా ఛేదించారు. సీఐ కె. మద్దయ్య ఆచారి, ఎస్ఐ లోకేష్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం శాస్త్రీయ దర్యాప్తుతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసింది.
31.10.2026న సి. మల్లవరం గ్రామ సమీపంలోని జనచైతన్య వెంచర్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. హత్యకు గురైనట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి వివరాలు తెలియకపోవడంతో పాటు ఘటనా స్థలంలో ఆధారాలు లభించకపోవడంతో కేసు సవాలుగా మారింది. పోలీసు బృందం విస్తృత విచారణ, మిస్సింగ్ కేసుల పరిశీలన ద్వారా మృతురాలిని వేలూరి భాగ్యశ్రీ (26)గా గుర్తించింది.
అనంతరం వందలాది సీసీ కెమెరాల ఫుటేజీలు, ANPR కెమెరాల వివరాలు, CDR విశ్లేషణ ఆధారంగా నిందితుడు షేక్ జమాలుల్లా బాషా @ జమీల్ బాషా (38) కదలికలను గుర్తించారు. ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టి 16.11.2026న చిత్తూరు జిల్లా రొంపిచెర్ల క్రాస్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేశాయి.
నిందితుడి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన AP 39 TC 6458 నంబరు గల ఆటో, రెండు సెల్ఫోన్లు, రూ.450 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.




