‘టీన్ తిగడా’ ట్రైలర్‌ను విడుదల చేసిన హిందీ జీ5
Hindi ZEE5 releases the ‘Teen Tigada’ trailer
ప్రేమకు వయసుతో పాటు ఎన్నో ఆశలు, ఆశయాలు తోడవుతుంటాయి. ముఖ్యంగా యంగ్ ఏజ్‌లో ప్రేమ, కెరీర్, జీవితంలో ఏదో సాధించాలనే తపన.. ఇలా ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. వీటితో పాటు జీవితంలోఊహించని మలుపులు కూడా ఎదురవుతుంటాయి. ఇలాంటి అంశాలతో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘టీన్ తిగడా’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రేమ, ఆశయాలు, అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. సంగీతం, క్రికెట్ నేపథ్యంగా సాగే కథలో యువత తమ కలలను నిజం చేసుకునేందుకు చేసే ప్రయత్నాలు, ప్రేమలో ఎదురయ్యే అనుభవాలు, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఆసక్తికరంగా చూపించనున్నారు. ప్రేమలో పడటం, తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే తపనతో పాటు అనుకోని సంఘటనలు వారి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పాయన్నది ఇందులో చూడొచ్చు. ప్రసన్న బిష్ట్, దనేష్ రజ్వీ, అర్చిక అరోరా, సమర్థ్ మెహతా, గ్రుషా కపూర్ కీలక పాత్రల్లో నటించారు. స్ట్రీట్ల్యాంప్ మీడియా ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ, ఐ స్క్రీమ్ డ్రీమ్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా ఈ సిరీస్‌ను నిర్మించాయి. నవంబర్ 20 నుంచి హిందీ జీ5లో ‘టీన్ తిగడా’ స్ట్రీమింగ్ కానుంది.
‘టీన్ తిగడా’ ట్రైలర్ యువత జీవితాలు, వారి కలలు, ఆశయాలను పరిచయం చేసేలా అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. సంగీతం, క్రికెట్, ప్రేమ నేపథ్యంలో ఈ కథ ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో అస్మాని, మానస్ అనే యువ జంట తమ ప్రేమను కొనసాగిస్తూనే వ్యక్తిగత ఆశయాలను నేరవేర్చుకునే దిశగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అనుకోకుండా ఎదురైన గర్భం దాల్చిన పరిస్థితి వారి జీవితాలను ఒక్కసారిగా మార్చేస్తుంది. దీంతో అప్పటివరకు సాగిన వారి ప్రేమకథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఓవైపు తమ కలలు, మరోవైపు ప్రేమ, మరో వైపు కొత్తగా ఎదురైన బాధ్యతలు.. ఇలా ఎన్నో సవాళ్ల మధ్య ఈ జంట ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? వారి భవిష్యత్తు ఎలా మారింది? అనేది ఆసక్తికరంగా అనిపిస్తోంది. యూత్‌ఫుల్ రొమాన్స్, సరదా సన్నివేశాలు, భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేమ, ఆశయాలు, పెద్దయ్యే క్రమంలో యువత తీసుకునే నిర్ణయాలను తెలియజేస్తోంది.
యువతలో ఎన్నో ఆశలు, ఆశయాలు ఉంటాయి. ఏదైనా సాధించగలమనే నమ్మకంతో ముందుకు సాగుతుంటారు. అయితే జీవితంలో ఎదురయ్యే అనుకోని పరిణామాలు వారి ప్రయాణాన్ని మరో దిశగా తీసుకెళ్తుంటాయి. ఇలాంటి ప్రేమ, ఆశయాలు, ఊహించని మలుపుల కలయికతో రూపొందిన సిరీస్ ‘టీన్ తిగడా’. ఇందులో అస్మాని క్రికెటర్ కావాలని కలలు కంటుంటే, మానస్ సింగర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అంతా సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో తాము తల్లిదండ్రులు కాబోతున్నామనే విషయం తెలియడంతో వారి జీవితాలు ఒక్కసారిగా మారిపోతాయి. అసలు ఊహించని ఈ పరిణామంతో ఇద్దరూ కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఒక వైపు తమ మధ్య ప్రేమను కాపాడుకోవడం, మరోవైపు వ్యక్తిగతంగా పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవడం.. మరో వైపు కొత్త బాధ్యతలను స్వీకరించడం వంటి అంశాలతో ఈ కథ సాగుతుంది. సంగీతం, క్రికెట్ నేపథ్యంగా యువత కలలు, ప్రేమ, సంబంధాలు, జీవితంలో ఎదురయ్యే అనుకోని పరిస్థితులను ఈ సిరీస్‌లో ఆసక్తికరంగా రూపొందించారు. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా…
నటి ప్రసన్న బిష్ట్ మాట్లాడుతూ..“‘టీన్ తిగడా’ కథ చాలా సహజంగా, ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్‌తో తెరకెక్కింది. మనం ఆశించినట్లే జీవితం సాగనప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామనేది ఇందులో చూపించారు. ఈ సిరీస్‌లో నా పాత్ర చేయడం చాలా బాగా నచ్చింది. మన జీవితాన్ని మనం ఒకలా ప్లాన్ చేస్తే.. జీవితం మాత్రం మరోలా ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి పరిస్థితులను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా మారడం ఈ పాత్రలో నాకు మంచి అనుభూతిని ఇచ్చింది.
ప్రతి ఒక్కరి జీవితంలోనూ అనుకోని పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో మన లక్ష్యాలను మళ్లీ గుర్తు చేసుకుని ముందుకు వెళ్లడానికి కొంచెం ధైర్యం ఉంటే చాలు. ముఖ్యంగా యువత ఈ కథకు బాగా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ వయసులోనే మనల్ని మనం అర్థం చేసుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం, కొత్త విషయాలను తెలుసుకోవడం వంటివి జరుగుతుంటాయి. ప్రేమ, కామెడీ, సరదా సన్నివేశాలు, ఊహించని మలుపులతో ‘టీన్ తిగడా’ అన్ని ఎలిమెంట్స్‌తో రూపొందించాం. ఈ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకులకు మెప్పిస్తుంది. నవంబర్ 20 నుంచి హిందీ జీ5లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.
నటుడు దనేష్ రజ్వీ మాట్లాడుతూ..“యువతలో ఉండే ప్రేమ, ఆశయాలు, జీవితంలో ఎదురయ్యే అనూహ్య పరిణామాల చుట్టూ ‘టీన్ తిగడా’ కథ సాగుతుంది. ఇందులో జీవితం ఎలా ఉండాలనే దానిపై కొన్ని ఆలోచనలు, లక్ష్యాలతో సాగే పాత్రలో నటించాను. కానీ మనం అనుకున్నట్లు జీవితం ఎప్పుడూ సాగదు కదా. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు మనుషుల మధ్య సంబంధాలు ఎలా మారుతాయి? అలాంటి సమయంలో ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది? అనే అంశాలను ఈ సిరీస్‌లో చూపించబోతున్నారు. సరదా సన్నివేశాలతో పాటు భావోద్వేగాలకు కూడా ఇందులో మంచి ప్రాధాన్యత ఉంది. ఇలాంటి మంచి కథలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ‘టీన్ తిగడా’ సిరీస్‌ను ప్రేక్షకులు చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని తెలిపారు.
‘టీన్ తిగడా’ ట్రైలర్‌ను విడుదల చేసిన హిందీ జీ5

- Advertisement -
- Advertisement -



