మంత్రి ప్రశాంత్ రెడ్డి ని  పరామర్శించిన సీఎం కేసీఆర్

- Advertisement -

హైదరాబాద్:అక్టోబర్ 13:  ముఖ్యమంత్రి  చంద్రశేఖర్‌రావు ఇవాళ నిజామాబాద్‌ జిల్లాకు వెళ్లారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఉదయం 9 గంటలకు ఆయన ప్రగతిభవన్‌ నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరారు.

ఉదయం 10 గంటలకు జిల్లాలోని వేల్పూర్‌కు సీఎం చేరుకోనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు వేల్పూర్‌లో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

cm-kcr-visited-minister-prashanth-reddy
cm-kcr-visited-minister-prashanth-reddy

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ (77) గురువారం కన్నుమూశారు. ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు.

మంజులమ్మకు గతంలో బ్రెయిన్‌ ట్యూమర్‌ సర్జరీ జరిగింది. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో మృతిచెందారు. సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా మంజులమ్మ అంత్యక్రియలకు హాజరుకానున్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular