వరుస సమీక్షలు చేస్తున్న సీఎం రేవంత్

- Advertisement -

హైదరాబాద్: వరుస రివ్యూలతో సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి బిజీబిజీగా ఉన్నారు.ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రివ్యూ చేశారు. పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీ అధికారులను సీఎం ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలు, నోటిఫికేషన్ల వివరాలతో రావాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రైతు భరోసా పథకంపై కూడా సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.

CM Revanth is doing a series of reviews
CM Revanth is doing a series of reviews

సెక్రటేరియట్‌లో వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అధికారులు హాజరయ్యారు. సచివాలయంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం అధికారులతో.. ఏక్సైజ్ శాఖ అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు , ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular