- Advertisement -
సీఎం కు అస్వస్థత..
లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి, ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది.
మంగళవారం ఆయన షుగర్ లెవల్స్ పడిపోయాయి. దీంతో ఆయనకు వైద్యులు మెడిసిన్స్ అందించారు. ఇదిలా ఉండగా అనారోగ్యం కారణంగా ఆయన 4.5 కిలోల బరువు తగ్గిపోయినట్లు సమాచారం.
మనీలాండరింగ్ కేసులో ఆయనకు ఏప్రిల్ 15 వరకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను తిహాడ్ జైలుకు తరలించడంతో సీఎం పదవి మార్పుపై పలు ఊహాగానా లు సాగుతున్నాయి.”
- Advertisement -