రాష్ట్రంలో కొనసాగుతున్న చలి తీవ్రత

- Advertisement -

రాష్ట్రంలో కొనసాగుతున్న చలి తీవ్రత

రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. రెండ్రోజుల కిందటితో పోలిస్తే మాత్రం మూడు, నాలుగు జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు కొద్ది మేర పెరిగాయి.

రాష్ట్రంలో కొనసాగుతున్న చలి తీవ్రత

సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 7.4 డిగ్రీలు

మూడ్రోజుల పాటు యెల్లో అలెర్ట్‌..

రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. రెండ్రోజుల కిందటితో పోలిస్తే మాత్రం మూడు, నాలుగు జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు కొద్ది మేర పెరిగాయి. శనివారం సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 7.4 డిగ్రీలుగా రికార్డయింది. ఆసిఫాబాద్‌లో 8, ఆదిలాబాద్‌ జిల్లా సోనాలలో 8.5, అదే జిల్లా బేలలో 9.1, బజార్‌హత్నూర్‌లో 9.3, బోథ్‌, నిర్మల్‌లో 9.5, రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో 9.9 డిగ్రీలుగా నమోదైంది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ 10-15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. వచ్చే మూడ్రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 11-15 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మూడ్రోజులకు యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular