కమిషన్ కు విచారణ జరిపే అర్హత లేదనతం కెసిఆర్ అవివేకానికి నిదర్శనం
మెదక్ ఘటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల తీరు సరికాదు
బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శ
హైదరాబాద్ జూన్ 17 (
:విద్యుత్ విచారణ కమిషన్ ఎదుట మాజీ సిఎం కేసిఆర్ హాజరు కాకుండా, అసలు కమిషన్ కు విచారణ జరిపే అర్హత లేదంటూ విమర్శించడాన్ని బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు.గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, పవర్ ప్లాంట్ల ఏర్పాటు అంశాలపై కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేసిన కమిషన్ ముందు కేసీఆర్ హాజరై వివరణ ఇచ్చి ఉంటే ఆయనకే గౌరవంగా ఉండేదని, అసలు వివరణ ఇవ్వకుండా, విచారణ కమిషన్ నే విమర్శిస్తూ… లేఖ రాయడం విచారణ వ్యవస్థలను అగౌరవపరచడమే అని, పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసిఆర్ తీరు అప్రజాస్వామికమని మహేశ్వర్ రెడ్డి ఆక్షేపించారు. అసలు తన పాలనలో విద్యుత్ రంగంలో తప్పులే జరగకపోతే కమిషన్ ముందు హాజరై వివరాలు చెప్పడానికి కేసిఆర్ కు భయం ఎందుకని ప్రశ్నించారు.ఏకంగా విచారణ కమిషన్ నే తప్పుపడుతూ… మాజీ సిఎం కేసీఆర్ ఎదురుదాడి చేస్తుంటే…ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎందుకు స్పందించడం లేదనీ ప్రశ్నించారు. ప్రభుత్వం వేసిన కమిషన్ నే కెసిఅర్ తప్పు పడుతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదన్నారు. విద్యుత్ రంగంలో అక్రమాలపై సీబీఐ విచారణతో అసలు వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నా… రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాజీ జడ్జీతో విచారణ కమిషన్ వేసిందో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు బయటకు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరి తమ చిత్త శుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.ఇక ఈ విషయంలో మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వాఖ్యలు సరికావన్నారు. కమిషన్, విచారణ వ్యవస్థలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తప్పులు జరగనప్పుడు వాస్తవాలు కమిషన్ ముందు చెప్పడానికి భయం ఎందుకని ప్రశ్నించారు.
కమిషన్ కు విచారణ జరిపే అర్హత లేదనతం కెసిఆర్ అవివేకానికి నిదర్శనం: బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- Advertisement -
- Advertisement -