మాచవరం హైస్కూల్లో సమగ్ర సర్వే పరిశీలన
Comprehensive survey observation in Machavaram High School
డిప్యూటీ డీఎం అండ్ హెచ్ ఓ పద్మావతి
మాచవరం,
పల్నాడు జిల్లా మండల కేంద్రమైన మాచవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహిస్తున్న సమగ్ర సర్వే కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా డిప్యూటీ డిఎంహెచ్వో పద్మావతి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ, విద్యార్థులకు ఆయుష్మాన్ భారత్ ద్వారా రక్తహీనత, దేహ పరీక్షలు నిర్వహించి సమగ్ర నివేదిక తయారు చేస్తారన్నారు. ఆర్ బి ఎస్ కే కార్యక్రమం ద్వారా ఈ ప్రోగ్రాములు కండక్ట్ చేసామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మూడు టీంలు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈ క్యాంపు నిర్వహించాలన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ ప్రసాద్, డాక్టర్ అన్వేష్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.