బండ్లగూడ జాగీర్ మునిసిపల్ లో నెగ్గిన ఆవిశ్వాసం
బండ్లగూడ జాగీర్ హస్తనిదే
మేయర్ పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం
డిప్యూటీ మేయర్ వర్గం పైచేయి
రాజేంద్రనగర్ నియోజకవర్గం స్పెషల్ కరస్పాండెంట్ కట్టా శృతి : మార్చ్ 21( వాయిస్ టుడే) బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ లో అవిశ్వాసం అంకం గురువారంతో ముగిసింది. మేయర్ మహేందర్ గౌడ్ పై 16 మంది కార్పొరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డి వర్గానికి విజయం సాధించింది.
ఇప్పటి వరకు బండ్లగూడ జాగీర్ బీఆర్ఎస్ ఆధీనంలో ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారి.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇక్కడ కూడా పరిస్థితులు మారిపోయాయి. మేయర్ పనితీరుపై వ్యతిరేకత, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరితే అభీరుద్ది పనులు చేపట్టేందుకు పార్టీ మార్పు తప్పదని అత్యధిక శాతం కార్పొరేటర్ల అభిప్రాయం.
గత నెల 12నే అవిశ్వాసంపై ఓటింగ్ జరగాల్సి ఉంది. కానీ, మేయర్ మహేందర్ గౌడ్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అనంతరం నలుగురు కార్పొరేటర్లతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. మేయర్ ను దించాలని మెజారిటీ కార్పొరేటర్ల పంతం నెగ్గింది.