బీసీలకు రిజర్వేషన్స్ ఎట్లా వచ్చాయి?
ఆంధ్ర తో విలీనం చేసే ముందు అప్పటి నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రము లో బీసీల జాబితా లేకుండె. శివ శంకర్ 1951 లో అడ్వకేట్ గా జాయిన్ అయ్యినాన్క 1953 లో అప్పటి ముఖ్య మంత్రి బూర్గుల రామకృష్ణ రావు కి “చదువులో మరియు సామాజికముగా వెనకబడ్డ వారిని బీసీలుగా రాజ్యాంగంలోన పరిగణించినా హైద్రాబాదు రాష్ట్రములో మాత్రము మా బీసీల లిస్ట్ లేదు, మీరు తయారు చేయించాలని అరజీ పెట్టిండ్రు. లిస్టు తయారు అయ్యింది, దానిని కోర్టు కొట్టేసింది. ఇట్లా ఆయన ప్రతి కొత్తగా ముఖ్య మంత్రి అయిన వారి దగ్గరికి పోవడము (బూర్గుల రామకృష్ణ (1953 ), నీలం సంజీవ రెడ్డి 1956, దామోదరం సంజీవయ్య 1960 , కాసు బ్రహ్మానంద రెడ్డి 1964 దగ్గరకి పోవడము వాళ్ళ దగ్గర బీసీల లిస్టు కోసము అప్లికేషన్ పెట్టుకోవడము, దానిని నీలం సంజీవ రెడ్డి లాంటి వారు పట్టించుకోకపోవడము, కొందరు జి.ఓ. తీసినను దానిని కోర్టు కొట్టేయడము, 1967 వరకు జరిగినవి. చివరికి శివ శంకర్ అప్పటి ముఖ్య మంత్రి బ్రహ్మానంద రెడ్డి తో మీరు జిఓలు కరెక్టుగా తీయడము లేదు. తీసిన వాటిని మీ లాయర్లు కావాలనే ఓడిపోతున్నారు అని కొట్లాడిన్రు, అప్పుడు ఆయన ఎట్లాగైతే నేను ఒక కమిషన్ వేస్తా అట్లనే నిన్ను గవర్నమెంట్ ప్లేఅదేరని చేస్తా. కమిషన్కి నువ్వు సహకరించి నువ్వే బీసీల లిస్టు తయారు చెపించుకో, ఆ తరువాత కోర్టులో నువ్వే కొట్లాడి ఆ లిస్టుని నువ్వే అమలులోకి తెచ్చుకో అని ఆర్డర్స్ పాస్ State Of Andhra Pradesh And Ors vs U.S.V. Balram Etc on 28 January, 1972చేసిండ్రు. శివ శంకర్ సుప్రీమ్ కోర్టు దాకా పోయి కొట్లాడి బీసీల లిస్టుని సాధించి తెచ్చిన కేసు బలరాం స్టేట్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ (1972(1) SCC 660, (State, of, Andhra, Pradesh, and, others, vs. USV. Balram.) సుప్రీమ్ కోర్ట్ నుంచి 28, January, 1972 . శివ శంకర్ ఈ కేసు గెలిచి పాజిటివ్ జుద్గెమెంత్ తీసుకొచ్చినందుకే ఈ రోజు మన రాష్ట్రములో బ్యాక్ వార్డ్ క్లాస్సేస్ లిస్టు ఒకటి మనకు ఉంది. అదే కాదు, వెనుకబడిన తనము ప్రకారము ఆ, బి, సి, డ్, వర్గీకరణ చేసే ప్రక్రియ కూడా ఆయన పెట్టిన ప్రతిపాదననే.
ఇదే కాదు, ఈ కులాలకు మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా రేజర్వేషన్లు కేటాయించాలని సుప్రీమ్ కోర్టునుంచి ఆర్డర్ తీసుకుని వచ్చిండ్రు శివ శంకర్ . రేపు రిలీజ్ అయ్యే పుస్తకాన్ని మన బీసీలకు చెందిన ఒక సీనియర్ జర్నలిస్టు నాకు క్లోజ్ ఫ్రెండ్ (నేను ఆయన పేరు ఇక్కడ చెప్పగలనో లేదో) ఒకరు, “కష్టాలకు ఎదురీది: ఓ జీవితావిష్కరణ” అని వర్ణించిండ్రు.
మన కోసము, మన పిల్లల భవిష్యత్తు కోసము ఇంత పాటు పడ్డ శివ శంకర్ జీవిత చరిత్ర పుస్తకఆవిష్కరణకి మీరందరు వస్తారని ఆశిస్తూ…
వేదిక: రవీంద్ర భారతి, హైదరాబాదు
తేదీ: 24-08-2023 సమయం: సాయంత్రం 6.30 గంటలకు
మహామనిషి శివశంకర్ స్మృతులను మరోసారి గుర్తు చేసుకునే ఈ అసాధారణ కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని మనవి. అందరూ ఆహ్వానితులే! డాక్టర్ పి. వినయ్