కాంగ్రెస్ హామీలు – 6 గ్యారంటీలు, 66 మోసాల పైన చార్జిషీట్ తో ఎమ్మార్వోకు బీజేపీ నాయకుల వినతి పత్రం
Congress guarantees-BJP leaders petition to MMAR with charge sheet on 6 guarantees, 66 frauds
చొప్పదండి
కరీంనగర్ జిల్లా గంగాధర మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో గురువారం గంగాధర మండల ఎమ్మార్వో
కు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను వెంటనే నెరవేర్చాలని బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పెరక శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 420 మాటలతో అర్థం కాని 66 వాగ్దానాలతో 6 గంట గ్యారెంటీ ల పేరుతో తెలంగాణ ప్రజలను సబ్బండ వర్గాలను కర్షక కార్మిక రైతు విద్యార్థి మరియు యువకులను మోసం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దడెక్కడానికే లక్ష్యంగా చేసుకొని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసి నేటికి సంవత్సరం గడుస్తున్నా సబ్బండ వర్గాలకు ఇచ్చిన హామీలను మరిచి మతిమరుపు రాజకీయాలను చేస్తూ నేడు కేసీఆర్ను ప్రభుత్వాన్ని మించి ప్రజలను మోసం చేయడం దురదృష్టకరమని అన్నారు. గంగాధర మండల లో నేటి ఎమ్మెల్యే తో పాటు ఆనాటి పీసీసీ అధ్యక్షుడిగా నేటి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మరియు నాయకులు గంగాధర మండలంలో విద్యార్థులకు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి విద్యార్థులను మోసం చేయడం అలాగే నష్టపోతున్న రైతులకు పరిహారాలు ఇప్పిస్తామని చెప్పి ప్రజలను మోసం చేయడం అదేవిధంగా ప్రతి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు మరిచి కేవలం ప్రభుత్వాన్ని జోకే పని తప్ప అభివృద్ధి పని పెట్టుకోలేదని విమర్శించారు.స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఆలోచించాలి నేటికీ మీరు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులను కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన పనులని మర్చిపోకూడదని వారు ఎమ్మెల్యే గారికి సూచించారు.
ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చిన నిధులను మీరు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి అని తీర్చిదిద్దే ప్రయత్నం నియోజకవర్గంలో చేస్తున్నారని వారు. మీకు దమ్ముంటే రాష్ట్రంలో మీరు వంద రోజులలో చేస్తానన్న ఆరు గ్యారెంటీలను అమలు చేసి ఈరోజు నియోజకవర్గంలో వచ్చేసి 20% పెండింగ్ ఉన్న రైతు రుణమాఫీలను కావచ్చు మీరు హామీ ఇచ్చిన పదంగా 416 ఆసరా పింఛన్లు కావచ్చు మీరు హామీ ఇచ్చిన విధంగా పంట పండించిన ప్రతి రైతుకు అది ఏ వడ్ల గింజల అయినా కూడా బోనస్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ.
లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా మేము కార్యక్రమాలు రైతులతో మరియు సబ్బండ వర్గాలతో చేస్తామని ప్రభుత్వానికి సూచించారు. అదేవిధంగా స్థానిక ఎంపీ మరియు కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో తెలంగాణ అభివృద్ధి పైన దృష్టి పెట్టి వారి సహకారాలు తీసుకోవాలని కానీ మీరు మంత్రి పైన అనుచిత వాక్యాలు కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు మానుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అశోక్
, దళిత మోర్చా జిల్లా అధికార ప్రతినిధి మల్యాల వినేసాగర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడవల్లి శశిధర్ రెడ్డి,
యువమోర్చా జిల్లా కార్యదర్శి గుండారపు సంపత్ కుమార్, ఉపాధ్యక్షులు బొమ్మకంటి రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శులు పంజాల ప్రశాంత్,రేండ్ల శ్రీనివాస్,
జిల్లా నాయకులు సుద్దాల రవీందర్ రెడ్డి పెంచాల రాములు, ఎంపిటిసి బిజెపి సీనియర్ నాయకులు బాపు లచ్చయ్య,మాజీ ఉప సర్పంచ్ గాలి పెళ్లి శ్రీనివాస్,కోల శ్రీనివాస్,దళిత మోర్చా మండల అధ్యక్షులు తాళ్ల రాజశేఖర, యువ మోర్చా మండల అధ్యక్షులు దయ్యాల ప్రణయ్, మండల కిసాన్ మోర్చా నాయకులు కట్ల శ్రీనివాస్, దేశెట్టి రవి, శ్రీనివాస్, శ్రీకాంత్ ,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



