Sunday, September 8, 2024

పాల్వాయి కుటుంబాన్ని కాంగ్రెస్ అవమానించింది

- Advertisement -

పాల్వాయి కుటుంబాన్ని కాంగ్రెస్ అవమానించింది
మంత్రి కేటీఆర్
హైదరాబాద్
కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి ఆదివారం  భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు సమక్షంలో పార్టీలో చేరారు.
బీఆర్ ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ పాల్వాయి స్రవంతిని ఒక సోదరుడుగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలోకి ఎందుకు పోయారో…మళ్లీ

తిరిగి కాంగ్రెస్ లోకి ఎందుకు చేరిండో ఎవరికి తెలవదు. ఆయన వలన రాష్ట్రం ఉప ఎన్నికను ఎదుర్కొని పరిపాలన అస్తవ్యస్తం అయ్యేలా చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంవత్సరాలపాటు పార్టీ ఎత్తుపల్లాలో అండగా

నిలిచిన కుటుంబం పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ది. కాంగ్రెస్ పార్టీ పట్ల తన నిబంధన చాటుకుంటూ పార్టీ మారకుండా, పార్టీకి అండగా నిలబడ్డ వ్యక్తి గోవర్ధన్ రెడ్డి. అలాంటి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ

అవమానపరిచింది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేసేందుకు ముందుకు రాకున్నా స్రవంతి గారు పోటీ చేసి కాంగ్రెస్ కి గౌరవప్రద స్థానాన్ని కట్టబెట్టారు. గోవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని వాడుకొని కాంగ్రెస్

పార్టీ పరువు దక్కించుకుంది. నిన్నటిదాక రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి తిట్టుకున్న తీరు ప్రజలు చూశారు. డబ్బు మదంతో విర్రవీగుతున్న రాజగోపాల్ రెడ్డికి మునుగోడు లో బుద్ధి చెప్పాల్సిన బాధ్యత

మనందరి పైన ఉన్నది. ఈ రోజు పార్టీలో చేరడంతో మన పని అయిపోలేదు ఇప్పుడే పని ప్రారంభమైంది. మునుగోడులో గులాబీ జెండా మరోసారి ఎగరేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఇప్పుడు మళ్లీ కలిసిపోయిన తీరు ప్రజల్లో ఏవగింపును కలిగిస్తుంది. నల్లగొండ జిల్లాకు ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గానికి మన ప్రభుత్వం చేసిన పనులన్నీ మీ కండ్ల ముందే ఉన్నాయి. తరతరాల

ఫ్లోరైడ్ తరిమివేసి, మునుగోడు నియోజకవర్గం లోని మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరించుకోవడం జరిగింది. కెసిఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్లోరోసిస్ వ్యాధి పూర్తిగా తెలంగాణ నుంచి పోయిందని కేంద్ర

ప్రభుత్వంమే స్వయంగా చెబుతుంది. నల్లగొండ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా గతంలో లేకుండే కానీ ఇప్పుడు మూడు మెడికల్ కాలేజీలు వచ్చాయి. భారతదేశంలోనే అత్యంత పెద్దదైన అల్ట్రా మెగా

పవర్ ప్రాజెక్ట్ నల్గొండ జిల్లాలోనే వస్తుంది. తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఒకప్పటి యాదగిరిగుట్ట

ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా యాదాద్రిగా మారిందో ఆలోచించాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యవసాయము ఉచిత విద్యుత్తు పైన ఏమాత్రం అవగాహన లేదు. కేవలం రైతులకు మూడు గంటల

విద్యుత్ సరిపోతుంది అంటూ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అంటున్నారు. రైతుబంధు ఇవ్వడం డబ్బులు వృధా అని ఉత్తంకుమార్ రెడ్డి అంటున్నాడు.
కాంగ్రెస్ కావాలా కరెంట్ కావాలా రైతులు ఆలోచించుకోవాలి. తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుగా కేసీఆర్ని కట్టడి చేస్తే తమకు ఎదురులేదని రాహుల్ గాంధీ మోడీ భావిస్తున్నారు. తాము తప్ప ఇతరులు

ఎదగకూడదన్న దుర్మార్గపురిత ఆలోచన వాళ్ళది.
స్రవంతి  తన భవిష్యత్తు గురించి కాకుండా తన కష్ట కాలంలో తన వెంట నడిచిన నాయకులు వాటి శ్రేణుల గురించి అడిగారు. వారి భవిష్యత్తు బాధ్యతను నేను తీసుకుంటానని అన్నారు.
పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ దీపావళి పండుగ రోజు భారత రాష్ట్ర సమితిలో చేరడం సంతోషంగా ఉంది.  కాంగ్రెస్ పార్టీని విడాలన్న నిర్ణయం బాగా ఆలోచించి తీసుకోవడం జరిగింది. ఎక్కడైతే గౌరవం లేదు

అక్కడ ఒక్క నిమిషం ఉండకూడదని మా తండ్రి చెప్పిన మాటలు మేరకు కాంగ్రెస్ని వీడాను. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మాకు తెలిసిన కాంగ్రెస్ పార్టీ కానే కాదు. ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో ఒక

సానుకూలమైన మార్పు అవసరం అన్న ఆలోచనతో మా పార్టీ కార్యకర్తలు నాయకుల అభిప్రాయంతో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్,  భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరుడు కేటీఆర్ తో నడవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాతోపాటు నడిచి వచ్చిన కార్యకర్తలు నాయకుల భవిష్యత్తు బాధ్యతను

కేటీఆర్ కి అప్పజెప్పి ఆయన మీద విశ్వాసంతో ముందుకు నడుస్తున్నామని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్