రామగుండంలో రాజ్ ఠాకూర్ గెలుపుతోనే ప్రజలకు న్యాయం
గోదావరిఖని ఎన్నికల ప్రచార బేరిలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి
రామగుండం నవంబర్ 11: రామగుండం ప్రజలకు న్యాయం జరగాలి అంటే రాజ్ ఠాకూర్ గెలవాలని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు గోదావరిఖనిలో జరిగిన ఎన్నికల ప్రచార భేరి లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె సైరన్ను మోగించి రాష్ట్రం వచ్చేంతవరకు విశ్రమించని సింగరేణి బొగ్గు గని కార్మికులు ఉన్న రామగుండం నియోజకవర్గం రాష్ట్రానికి వెలుగుల్నిచ్చిన రామగుండం కెసిఆర్ ఆమె కుమార్తె కవిత స్థానిక శాసనసభ్యుడు చందర్ దోపిడి విధానాల వల్ల చీకటి మయం అయిపోయిందని ఈ పరిస్థితి పోవాలంటే “మార్పు రావాలి కాంగ్రెస్ గెలవాలి” అని ఆయన ప్రజలతో నినాదాలు చేయించారు. సింగరేణి బొగ్గు కని లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు తీరాలన్న ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల పనులు ఆగాలన్న భూదోపిడి ఇసుక దోపిడీ బొగ్గు దోపిడీ బూడిద దోపిడి ఈ ప్రాంతంలో ఆగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యావత్ ప్రజల సంక్షేమానికి6 గ్యారంటీలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, తెలంగాణ వచ్చిన ఈ తొమ్మిదేళ్ల పాలనలో ఎంతో పెద్ద నగరంగా వెలుగొందాల్సిన రామగుండన్ని చీకటి మాయం చేసిన ఘనత స్థానిక శాసనసభ్యులు దక్కుతుందని, ఓపెన్ కాస్ట్ తో రామగుండం బొందల గడ్డగా మార్చిన ఎమ్మెల్యేకు ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరేషన్ తోపాటు కార్మిక కర్షక యువత మహిళ రైతు కూలీ అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందనిఅని ఆయన అన్నారు. రాష్ట్రంలో కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని రామగుండం నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. శాసన సభ్యుడిగా తనను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంథని శాసనసభ్యులు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల శ్రీధర్ బాబు, ఐ ఎన్ టి యు సి నాయకులు జనక్ ప్రసాద్ రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు