కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి
విశాఖపట్నం
రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. పాలకపక్షం, ప్రతిపక్షం భాజపాతో ములాఖత్ అయ్యాయని ఆరోపించా రు. విశాఖలో పార్టీ కార్యకర్తల సమా వేశంలో ఆమె మాట్లాడారు.బీజేపీ వైకాపా కంటికి కనిపించని పొత్తు పెట్టుకుందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ మాట్లాడారని,అధికారంలోకి వచ్చా క దానిపై పోరాటమే లేదని, విశాఖకు ఏం చేశారు? రైల్వే జోన్ కూడా ఇవ్వలేదని,గంగవరం పోర్టులో రాష్ట్ర వాటాను అప్పనంగా ఇచ్చేశారని మండిపడ్డారు.విశాఖ ఉక్కు కార్మాగారానికి తూట్లు పొడుస్తు న్నారని,స్టీల్ప్లాంట్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్వీర్యం చేశాయని, ఇప్పుడున్న ప్రభు త్వం పోవాలి.. కాంగ్రెస్ రావాలని పిలుపునిచ్చారు.
కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి
- Advertisement -
- Advertisement -