విజయవంతంగా సాగుతున్న సీపీఎం రక్షణయాత్ర

- Advertisement -

విజయవంతంగా సాగుతున్న సీపీఎం రక్షణయాత్ర

CPM Raksha Yatra is going on successfully

పరవాడ

అనకాపల్లి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కె.లోకనాధం అధ్వర్యంలో ఫార్మా, సెజ్ కార్మికుల భద్రత కొరకై ఈనెల 16 తేదీ న పాయకరావుపేటలో ప్రారంభమైన  రక్షణయాత్ర  గురువారం సాయంత్రం 7 గంటల  పరవాడ మండలం తానం చేరుకుంది. రాత్రికి తాడి గ్రామంలో సమావేశం జరిగింది. శుక్రవారం ఉదయం లంకెలపాలెం జంక్షన్ లో కార్మికులతో జరిగిన  ఈ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం పరవాడ సినిమా హాల్ జంక్షన్లో జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు బి ప్రభావతి మాట్లాడుతూ ఫార్మా, సెజ్ కార్మికులకు ప్రభుత్వం చొరవ తీసుకుని కంపెనీలు ఉన్న ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలు,స్పెషల్ బర్న్ వార్డ్ లు ఏర్పాటు చేయాలని ఇవి లేకపోవడం వలన  ప్రమాదాలకు గురైన కార్మికులను అనకాపల్లి, విశాఖపట్నంలకు తరలించే లోపు కార్మికులు చనిపోతున్నారన్నారు. ఈ సెజ్ లు వచ్చినప్పుడు స్థానికులకు 75% ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారని వాటిని ఇంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయలేదని ఇప్పటికైనా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిచాలని చెప్పారు. పరిశ్రమలో భద్రత, కార్మికుల రక్షణకై సిపిఎం నిర్వహిస్తున్న బైక్ యాత్రకు కార్మికుల నుంచి, ప్రజలు నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శులకు సభ్యులు జి,కోటేశ్వరరావు,సిఐటియు జిల్లా అధ్యక్షులు అధ్యక్షులు,ఆర్ శంకర్రావు, జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ, వివి రమణ,పి మాణిక్యం, వివి శ్రీనివాసరావు, డి దేముడు, కర్ణం వెంకట్రావు, కే సోమినాయుడు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular