మన దేశం లో క్రికెట్ అంటేనే ఒక భక్తి, ఒక పిచ్చి, ఒక ఉద్వేగం, ఒక ఉత్సాహం, ఒక ఆనందం, ఒక కోపం – ఇవ్వన్నీ కలిస్తే వచ్చే ఫీలింగే – క్రికెట్
క్రికెట్ మ్యాచ్ ఉందంటే చాలు, ఆరోజు అనధికారిక సెలవు దినం.
ఆఫీస్ ల్లో, కాలేజీల్లో, రైళ్లలో, బస్సుల్లో, ఇళ్లలో, పరీక్షల్లో, పబ్బుల్లో, క్లబ్బుల్లో, హోటళ్ళలో అసెంబ్లీ లో, పార్లమెంట్ లో – ఒక చోటేమిటి, అన్నీ చోట్లా – క్రికెట్ మీదే చర్చ, ఆట మీదనే అందరి మనస్సులు ఉంటాయి. ప్రతి వాళ్ళు ఎక్స్పర్ట్ కామెంటేటర్స్ అయిపోతారు.
భారత దేశం అంటేనే, భిన్న కులాల, మతాల,భాషల, జాతుల, సంస్కృతుల, ఆచారాల సమాహారం.
కానీ, క్రికెట్ విషయానికి వచ్చేటప్పటికి, అందరూ ఒక్కటే. అందరిదీ ఒకటే మాట, మతం.
ఒక్కటే కోరిక /ఆకాంక్ష – ఇండియా గెలవాలి – అంటే – మనం గెలవాలి – మనమే గెలవాలి.
మరే ఆట, పండుగ, ఆచారాలు ఇంతగా భారత దేశాన్ని ఒక్క తాటి మీద నడిపించలేదు – ఒక్క క్రికెట్ తప్ప అసలు క్రికెట్ పదం అంటేనే, ఒక మేజిక్, ఒక కిక్కు. నిముషాలు, గంటలు, అలా, అలా తెలీకుండా స్నేహితులు / ఫామిలీస్ తో, గడిపే ఆనంద క్షణాలు.( అసలు స్నేహితులు అనాలా? ఎందుకంటే – ఏ హోటల్లోనో, బస్టాప్, రైల్లోనో, క్రికెట్ ఆట మీద చర్చించాలంటే, అప్పటికప్పుడు ఫ్రెండ్స్ అయి పోతారు ).
ఇండియా లో అన్నీ భాషల వాళ్ళు మాట్లాడే ఏకైక భాష పేరు – క్రికెట్
నిజానికి, భారత దేశపు జాతీయ క్రీడ – హాకీ – కానీ, దేశం లో ప్రజలందరూ, విపరీతం గా ప్రేమిచే క్రీడ – క్రికెట్. బ్రిటిష్ వాళ్ళు 18 వ శాతబ్దం లో క్రికెట్ ని దేశానికి పరిచయం చేస్తే, 1721 లో మొదటి క్రికెట్ మ్యాచ్ బ్రిటిష్ నావికుల కు, మరియి లోకల్ ఇండియన్ ప్లేయర్స్ కీ మధ్య జరిగింది.
*అప్పటి వరకూ ధనికులు, పెద్ద, పెద్ద సిటీల్లో మాత్రమే ఆడే ఆట గా పేరున్న క్రికెట్, ఎక్కడో హర్యానా – చండిఘడ్ లో, పెద్ద గా చదువుకోని, కపిల్ దేవ్, జూన్ 25, 1983 న మొట్ట మొదటి క్రికెట్ వరల్డ్ కప్ ఇండియా కీ అందించి నప్పుడు – మొత్తం ప్రపంచం ఒక్క సారిగా ఉలిక్కి పడి, ఇండియా వైపు చూడడం మొదలయింది అని గర్వం గా చెప్పొచ్చు.
నిజానికి, ఇండియా లో ప్లేయర్స్, ప్రజలు, ప్రభుత్వాలు, క్రికెట్ ఆట ని ప్రేమించడం మొదలు పెట్టింది అప్పటి నుండే అని చెప్పొచ్చు.
83 వరల్డ్ కప్ గెలవడం అనేది క్రికెట్ చరిత్ర లో ఒక గోల్డెన్ మైల్ స్టోన్.
అప్పణ్ణించి – ఇండియా క్రికెట్ లో వెనక్కి తిరిగి చూడలేదు. వరల్డ్ క్రికెట్ నే శాసించే స్థాయికి ఇండియా వెళ్ళింది. గవాస్కర్ – కపిల్ దేవ్ తర్వాత, అంత గా క్రికెట్ ప్రపంచం లో ఆరాధించే దేవుడు గా సచిన్ టెండూల్కర్ ని చెప్పుకోవాలి. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వం లో, సచిన్ మార్గ దర్శకత్వం లో, ఏప్రిల్ 2011 న రెండో సారి వరల్డ్ కప్ గెలవడం అనేది ఇంకో గోల్డెన్ మూమెంట్. సచిన్ తో పెట్టుకుంటే, ఇండియా తో పెట్టుకున్నట్లే అనే స్థాయి కీ క్రికెట్ ఆట సచిన్ ని తీసుకెళ్ళింది. సచిన్ టెండూల్కర్ అనే ఒక పేరు ఎంతో మంది యువత కీ ఆరాధ్య దైవం. సచిన్ తన అసమాన ప్రతిభ తో గ్రౌండ్ లో రాణించడమే కాదు – తన వినయం తో కూడిన ప్రవర్తన తో వరల్డ్ వైడ్ ఒక రోల్ మోడల్ గా ఇప్పటికి నిలిచాడు – ఎప్పటికి నిలుస్తాడు. ఇప్పటి ఆట లో సచిన్ రికార్డు లను బ్రేక్ చేస్తూ, అద్భుతం గా రాణిస్తున్న విరాట్ కోహ్లీ, సచిన్ తర్వాత స్థానాన్ని ఆక్రమిస్తున్నాడు.
2008 లో ప్రారంభం అయిన ఐపీల్ టోర్నమెంట్ ఆట స్వరూపాన్ని మార్చేయడమే కాదు – ప్రపంచంలో ని బెస్ట్ ప్లేయర్స్ ని ఫ్రాంచెయ్జీ ఫార్మాట్ లోకి తెచ్చి, ఎంతో మంది లోకల్ ఆటగాళ్ల ని మేటి క్రికెటర్లు గా తీర్చి దిద్దుతూ, కొన్ని వేల మందికి ఉపాధిని కొత్త మార్గాల్లో కల్పిస్తూ, షుమారు గా 50,000 కోట్ల వేల్యూ తో విరాజిల్లుతోంది.
ఇంతటి ప్రపంచ స్థాయి క్రికెటర్లు వేసిన మార్గం లో ప్రయాణం చేస్తున్న ఇండియా టీం – రేపు జరగబోయే ఫైనల్లో ఆస్ట్రేలియా ని ఓడించి, ముచ్చట గా మూడోసారి వరల్డ్ కప్ ను మూద్దాలడాలని, 142 కోట్లమంది
భారతీయుల ప్రార్ధన. ఎందుకంటే, ఈ కోరిక లో మతాలు, జాతులు, భాషలు, భావాలు, రాష్ట్రాలు, కోపాలు, ఏమీ ఉండవు. హద్దులు, ఎల్లలు లేని ప్రతి భారతీయుని గుండె చప్పుడు మనం వినొచ్చు – ఏమని?
రేపు ఇండియా వరల్డ్ కప్ మ్యాచ్ గెలవాలి అని.
మరి, భారతీ్యులందరం- కలసి – గట్టిగా చెప్పేద్దాం – ఆల్ ది బెస్ట్ -ఇండియా
– సత్య కేశరాజు