త్వరలో పార్టీ వీడుతారన్న ప్రచారం
సంగారెడ్డి : పటాన్ చెరు, నారాయణఖేడ్ లో కాంగ్రెస్ టికెట్ల ప్రకటనపై మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తన అనుచరులు కాట శ్రీనివాస్, సంజీవ రెడ్డికి టికెట్ దక్కకపోవడంతో పార్టీపై మండిపడుతున్నారు. రెండ్రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం వుందని సమాచారం.
డబ్బులు ఇచ్చిన వాళ్ళకే పార్టీలో టికెట్ ఇస్తున్నారని దామోదర ఆవేదన వ్యక్తం చేసారు. మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు.
ఈ నేపధ్యంలో దామోదర రాజనర్సింహ ఇంటికి టీపీసీసీ ఉపాధ్యక్షులు సంజీవరెడ్డి చేరుకున్నారు. దామోదర ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగారు. సంజీవ రెడ్డి నారాయణఖేడ్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన విషయం తెలిసిందే. టికెట్ రాకపోవడంతో అయన కుడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సంజీవరెడ్డికి కాంగ్రెస్ పెద్దల ఫోన్ చేసినట్లు సమాచారం. జహీరాబాద్ ఎంపీ టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చినా సంజీవ రెడ్డి నిరాకరించారు.