- Advertisement -
వైరస్ తో కోళ్ల మృత్యు వాత
Death of chickens with virus
లబోదిబోమంటున్న రైతులు.
కామారెడ్డి
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో వైరస్ కలకలం కలకలం రేపింది. వైరస్ తొ వేల కొద్ది కోళ్లు చని పోతున్నాయి. కోళ్ల ఫారం యజమానులు లక్షల్లో నష్ట పోతున్నారు. వైరస్ సోకిందని చికెన్ ధరలు తగ్గిపోయి అమ్ముడు పోక షాపు యజమానులు సైతం నష్ట పోతున్నారు. ఫారం యజమానులు నెత్తిన చేతు పెట్టుకుని వాపోతున్నారు. కిష్టపూర్ లొ 2500 కోళ్లు చని పోయినట్లు ఒక యజమాని తెలిపారు. సుమారు 4.5 లక్షలు నష్ట పోయినట్లు తెలిపాడు.ఎక్కడ చూసినా కొళ్ల ఫాంలు ఖాళీ అయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలని యజమానులు కోరుతున్నారు.
- Advertisement -