- Advertisement -
గోవాకు తగ్గుతున్న పర్యాటకం
Declining tourism to Goa
పానాజీ, డిసెంబర్ 14, (వాయిస్ టుడే)
భారత్ ఎన్నో అందమైన ప్రదేశాలకు, సహజ సిద్ధమైన అందాలకు నిలయం. ప్రకృతి ప్రేమికులను ఆకర్షించే దట్టమైన అడవులు ఉన్నాయి. చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రాలకు అయితే కొదువ లేదు. ఇక బీచ్‌లు దేశంలో అనేకం ఉన్నాయి. అయితే గోవా బీచ్‌లు ఇక్కడ చాలా ప్రత్యేకం. ఇక్కడికి దేశంతోపాటు విదేశాల నుంచి కూడా టూరిస్టులు వస్తుంటారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి టూరిసమే ప్రధాన ఆదాయ వనరుగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టూరిజం అభివృద్ధికి, పర్యాటకుల రక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో విదేశీ పర్యాటకులను కూడా గోవా ఆకర్షిస్తోంది. ఏటా లక్షల మంది ఇక్కడి బీచ్‌లకు వస్తుంటారు. అయితే ఇటీవల గోవాకు వచ్చే పర్యాటకులు తగ్గుతున్నారు. దేశీయ పర్యాటకులతోపాటు విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గుతోంది.గోవా రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు ఐదేళ్లుగా తగ్గిపోతున్నారు. 2019లో గోవాకు రికార్డుస్థాయిలో 85 లక్ష మంది వచ్చారు. 2023 నాటికి ఆ సంఖ్య 15 లక్షలకు పడిపోయింది. ఈ లెక్క ప్రకారం 75 శాతానికిపైగా టూరిస్టులు తగ్గిపోయారు. కరోనా కారణంగా 2020లో కేవలం 2 లక్షల మంది, 2021లో 5 లక్షల మంది, 2022లో 12 లక్షల మంది మాత్రమే వచ్చారు. రష్యా, బ్రిటన్ నుంచి ఎక్కువగా టూరిస్టులు వచ్చేవారు. వారంతా ఇప్పుడు శ్రీలంకకు వెళ్తున్నారు.ఇక భారతీయ టూరిస్టులు ఎక్కువగా థాయ్‌లాండ్, మలేషియా వెళ్తున్నారు. దేశంలోని పర్యాటక ప్రదేశాలను చూడడం కన్నా ఫారిన్ వెళ్లడం మేలని భావిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం.. విమాన చార్జీలు తక్కువగా ఉండడం, వివిధ సంస్థలు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తుండడం, గోవా వెళ్తే అయ్యే ఖర్చులతో పోలిస్తే.. విదేశీలకు వెళ్తే అయ్యే ఖర్చు దాదాపు సమానంగా ఉండడంతో చాలా మంది, ముఖ్యంగా వయుత ఫారిస్ ట్రిప్‌కే మొగ్గురూపుతున్నారు.ఇక ఏటా గోవాకు వచ్చే ఫారిన్ టూరిస్టులు కూడా తగ్గిపోతున్నారు. థాయ్‌లాండ్, శ్రీలంగ, మలేషియా, మాల్దీవులు టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. ఇక కొన్ని దేశాల్లో ఖర్చు తక్కువగా ఉండడం కూడా విదేశాలకు వెళ్లేందుకు కారణంగా పరిశీలకులు చెబుతున్నారు.ఇక గోవాలో టాక్సీ మాఫియా విదేశీ టూరిస్టులను ఇబ్బంది పెడుతోంది. గతంలోనూ వెలుగు చూశాయి.వాటికారణంగా టూరిజం ఇమేజ్ దెబ్బతింటోంది. ఇక గోవాలో అసౌకర్యాలు, గోవా టూరిస్టు డెస్డినేషన్‌గా ఎంచుకవడానికి ఫారిన్ టూరిస్టులు వెనుకాడుతున్నారు. ఐదేళ్లుగా పర్యాటకుల సంఖ్య తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేషియాతో పోలిస్తే మన గోవాలో సౌకర్యాలు తక్కువగా ఉన్నాయ. దీంతో తెలుగు టూరిస్టులు కూడా గోవాకు వెళ్లకుండా ఫారిన్ ట్రిప్ వేస్తున్నారు. మౌలిక సదుపాయాలు, రవాణా, ఇతర టూరిస్టుల భద్రత విషయంలో గోవాకన్నా చురుగ్గా ఉన్నాయి..
- Advertisement -