ఇటీవల ఆన్‌లైన్ తరహా మోసాలు చాలా ఎక్కువైపోయాయి. ఎక్కువమంది కేటుగాళ్లు లోన్ యాప్స్ పేరుతో ఎక్కువ రుణాలు ఇస్తామంటూ ఆశచూపి అమాయకపు ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. అంతేకాదు లోన్స్ ఇచ్చిన తర్వాత అధిక వడ్డీ చెల్లించాలంటూ వారిపై ఒత్తిడి పెంచి మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇక ఇలాంటి ఫేక్ లోన్ యాప్స్‌ను నమ్మొద్దని కేంద్రం పలుమార్లు జనాలను హెచ్చరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా యూజర్లను ఓ ఫేక్ యాప్‌పై హెచ్చరించింది. దాన్ని వెంటనే తొలగించాలని సూచించింది.
పెద్దగా డాక్యుమెంటేషన్‌తో పనిలేకుండా.. ఈజీగా లోన్లు ఇచ్చే యాప్స్ చాలానే ఉన్నాయి. కానీ వీటిల్లో ఎక్కువ మోసపూరితమైనవి. వీటిని నమ్మి ఎంతోమంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి ఓ మోసపూరితమైన యాప్ ‘క్యాష్ ఎక్స్‌పాండ్ – యూ’. ఆన్‌లైన్‌లో లోన్స్ అందించే ఈ యాప్ మోసపూరితమైనదని.. అంతేకాకుండా ఇది నకిలీదని.. వెంటనే తమ మొబైల్స్ నుంచి తొలగించాలంటూ యూజర్లను హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. అటు ప్లే-స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి ఈ యాప్ తొలగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
‘క్యాష్ ఎక్స్‌పాండ్ యూ’ లోన్ యాప్‌పై గడిచిన ఆరు నెలల్లో ఏకంగా 1,062 కేసులు నమోదు కావడం గమనార్హం. యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ల నుంచి ఈ యాప్‌ను వెంటనే డిలీట్ చేయాలనీ కేంద్రం హెచ్చరించింది. తద్వారా ఆ యాప్ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఉండాలని తెలిపింది.