- Advertisement -
మల్టీ పర్పస్ హాల్ ను పరిశీలించిన డిప్యూటీ మేయర్
Deputy Mayor inspected the multi-purpose hall
తార్నాక
గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ రవి కిరణ్ తో కలిసి తార్నాక డివిజన్లోని మల్టీ పర్పస్ హాల్ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా, మల్టీ పర్పస్ హాల్ పనుల నాణ్యత మరియు పూర్తి చేసే గడువు పై సమీక్ష నిర్వహించారు. అనంతరం, ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో నిర్మాణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ను కూడా తనిఖీ చేసి, పనుల పురోగతిపై ఆరా తీశారు. పనులు నాణ్యతగా మరియు సమయానికి పూర్తి చేయాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగర ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ఈ సందర్బంగా డిప్యూటీ మేయర్ పేర్కొన్నారు.
- Advertisement -