- Advertisement -
చంద్రగ్రహణం సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం మూసివేత
జగిత్యాల జిల్లా బ్యూరో (అక్టోబర్ 29,23)వాయిస్ టుడే : జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం అక్టోబర్ 28 శనివారం రాత్రి 1.05 నిమిషాల నుండి రాత్రి 2-21 నిమిషాల వరకు గ్రహణవేధ ఉన్నందున 28-10-2023 శనివారం దేవస్థానం మధ్యాహ్నం 2-00 గంటలనుండి ప్రదాన దేవాలయంతో పాటు అనుభంద దేవాలయాలను మూసివేసినారు.
తిరిగి అక్టోబర్ 29 ఆదివారం రోజున గ్రహణం విడిచిన తదుపరి సంప్రోక్షణ, పుణ్యాహవాచనం , గ్రహణహోమం తదుపరి ఉదయం 9-00 గంటలకు భక్తులకు దర్శనములు ప్రారంభించ బడుతుందని అలాగే శనివారం రోజున జరుగు కోజాగిరి పౌర్ణమి చంద్రగ్రహణం కారణంగా రద్దు చేయబడినది. కావున సమాచారార్థం భక్తులకు మీడియా ద్వారా తెలియపరిచారు.
- Advertisement -