మునిసిపల్ కార్మికుల  ధర్నా!

- Advertisement -

మునిసిపల్ కార్మికుల  ధర్నా!

తాడేపల్లిగూడెం

మునిసిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ  ఏ.ఐ.టి.యు.సి. ఆధ్వర్యంలో మంగళవారం మునిసిపల్ కార్యాలయం ఎదుట  కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

సమానపనికి

సమానవేతనం ఇవ్వాలని , సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం
కనీసవేతనం 26 వేలు ఇవ్వాలని,  కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని, ఓ.పి.ఎస్. అమలు చేయాలని ,కొత్త పీఆర్సీ ప్రకటించాలని, పి.ఎఫ్.,

ఇ.ఎస్.ఐ. సమస్యలు పరిష్కరించాలని ,  సిబ్బంది సంఖ్య పెంచాలని, కార్మికులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

ఏ.ఐ.టి.యు.సి. రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. సోమసుందర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వంతో జరుగుతున్న

చర్చలలో కార్మికుల  సమస్యలకు  పరిష్కారం లభించని పక్షంలో 3 వ తేదీ నుండి తమ జే.ఏ .సి. సంఘాలు సమ్మెలోకి దిగుతాయని అన్నారు.

ఏ.ఐ.టి.యు.సి.ఏరియా కార్యదర్శి ఓసూరి వీర్రాజు మాట్లాడుతూ గతంలో

తమకు   ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాత్రమే తాము కోరుతున్నామని అన్నారు. పెరిగిన ధరవరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని కోరారు.

భవననిర్మాణ కార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు పాలూరి

లక్ష్మణరావు మాట్లాడుతూ పేదల ప్రతినిధినని చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన పేద పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం అన్యాయమని అన్నారు.సమస్యలు వెంటనే

పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సమ్మెకు మద్దతు ఇస్తామని తెలిపారు.

మునిసిపల్ వర్కర్స్ యూనియన్  కార్యనిర్వాహక అధ్యక్షురాలు మండేల్లి జయసుధ మాట్లాడుతూ చాలీ చాలని జీతాలతో ఇబ్బందులు

పడుతున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ధర్నాకు ఎ.ఐ.టి.యు.సి. నాయకులు మందలపర్తి హరీష్ , భవననిర్మాణ కార్మికసంఘం అధ్యక్షులు పడాల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు కోడె

సాయి బాలాజీ, మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకుడు మేళం నాగరాజు, మునిసిపల్  వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు తాడికొండ కనక మహాలక్ష్మి,  కే.చంద్రరావు, కే. కాటమరాజు, మండేల్లి

సత్యనారాయణ , అల్లం నరేంద్ర కుమార్ , యు.నాగరాజు, మండేల్లి  రామకృష్ణ, రౌతు రాజేష్, ధనాల రవి, బి.శివశంకర్,  లక్కవరపు శ్రీను, రమణ, బాదంపూడి శంకర్, బైపే సుబ్బారావు,  కళింగపట్నం శ్రీనివాస్ ,

ప్రవీణ్, చేపల సావిత్రి, సత్యవతి, వరలక్ష్మి,కోటమ్మ, తదితరులు నాయకత్వం వహించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular