జర్నలిస్టులకు 4సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలి:- జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా

- Advertisement -

జర్నలిస్టులకు 4సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
అసెంబ్లీలో చర్చించి వారి సంక్షేమానికి రూ.150 కోట్లు కేటాయించాలి.

– జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా

Dharna under the auspices of journalist associations

కూటమి ఎన్నికల మేనిఫెస్టో హామీ మేరకు జర్నలిస్టులకు 4 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని పలు జర్నలిస్టు సంఘాలు నేతలు డిమాండ్ చేశారు. జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సోమవారం  జర్నలిస్టుల ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి  నలు మూలల నుండి పెద్ద సంఖ్యలో  హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల  నేతలు మాట్లాడుతూ అన్ని వర్గాల గురించి శాసనసభ సమావేశంలో చర్చిస్తున్న ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమంపై చర్చించిన సందర్భాలు లేవని మండి పడ్డారు. తక్షణమే వారి సమస్యలపై ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో చర్చించి వారి సంక్షేమానికి బడ్జెట్ లో రూ.150 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలలో మాదిరిగా జర్నలిస్టులకు రూ.10వేలు చొప్పున పెన్షన్ సదుపాయం కల్పించాలని, ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలన్నారు .రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు,అవమానాలు, తప్పుడు కేసులు నమోదవుతున్నాయని వాటి నివారణకు తక్షణమే హై పవర్ కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. జర్నలిస్టుల అరకొర సంక్షేమ పథకాలు కొత్త అక్రిడేషన్లతో ముడిపడి ఉన్నాయి కాబట్టి తక్షణమే వాటి జారీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా రంగం నాల్గవ మూల స్తంభంగా ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పారు. దానికి వెన్నుముకగా ఉన్న జర్నలిస్టుల పరిస్థితి దారుణంగా ఉందని వారిని ప్రత్యేకత వర్గంగా గుర్తించి పలు సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, దాడుల నివారణకు చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి పంపే ఉద్దేశంతో కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)లో జిల్లా కలెక్టర్ కు డిమాండ్లతో కూడిన  వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎన్ఎ అధ్యక్షుడు ఈ సత్యనారాయణ,ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కె.రాము,ఆర్, రామచంద్రరావు,జాప్  అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి ఎస్.శ్రీనివాస్,కే.ఎం. కీర్తన్ టీజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జార్జ్, ఐడిజెఎన్ రాష్ట్ర అధ్యక్షుడు టి నానాజీ, పి. మధు,ఏపీజేయూ రాష్ట్ర నాయకులు బాలు,ఐజేయూహరినాథ్, ఏపీఈఎంజేఏ ప్రధాన కార్యదర్శి చందు యాదవ్, సామ్నా కిషోర్,ఎస్ సి ఆర్ డబ్ల్యూఏ నాయకులు సూర్య ప్రకాష్, కె డబ్ల్యూ జెడబ్ల్యూఏ నాయకులు ప్రసాద్,ఎస్. జగదీష్ కుమార్, ఏఎస్ ఎంఎన్ఐ ప్రధాన కార్యదర్శి కమల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular