- Advertisement -
జమిలీతో నియంతృత్వ పోకడలు పెరుగుతాయి
Dictatorship tendencies grow with Jamili
నరసాపురం
జమిలి ఎన్నికలతో దేశానికి ఏ విధమైన ఆర్థిక ప్రయోజనం లేకపోగా నియంత్రత్వ పోకడలు పెరుగుతాయని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ విధానంతో రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రాంతీయ పార్టీలుకు ముప్పుతప్పుదన్నారు. జాతీయస్థాయిలో నిరంకుశ విధానాలు అవలంబిస్తూ రాష్ట్రాల హక్కును కాలరాస్తున్న జమిలి ఎన్నికలను ప్రజాస్వామ్యవాదులు వ్యతిరేకించాలన్నారు. ఈ విధానంలో రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగడమా రద్దు అనేది కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుందన్నారు. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తేనే తీవ్రమైన ఉద్యమాలు చోటు చేసుకున్నాయాన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా అవమానించేటట్లు మాట్లాడిన చంద్రబాబు సమర్ధించడం దారుణం అన్నారు. ఈ దేశంలో కుల వ్యవస్థ నిర్మూల కోసం పోరాడిన వారందరూ దేవుళ్లే అన్నారు. రాముడు కృష్ణుడు కూడా అలా పోరాడారా అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఈనెల 30న జాతీయస్థాయిలో ఆందోళనలు నిరసనలు చేసేందుకు ప్రజలు మద్దతు తెలపాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో నిర్వహించే సి సి ఫుటేజ్, వెబ్ కాస్టింగ్ సంబంధించి ఆధారాలను ప్రజలకు ఇవ్వాల్సింది పోయి దీనిని ఇవ్వకుండా చట్టాలు చేయడం దారుణమని విమర్శించారు. ఎన్నికల కమిషన్ కూడా ఎన్డీఏ పార్టీలకు తొత్తుగా వ్యవహరిస్తుందన్నారు. కేరళ చెందిన జాతీయ పార్టీ సభ్యుడు కే బేబీ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఇతర ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రాల పట్ల వివక్షత చూపుతుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం లో క్రిస్టియన్ మైనార్టీలపై 745 దాడులు జరిగాయన్నారు. మణిపూర్లో 200 చర్చిలను ధ్వంసం చేశారన్నారు. ఎన్ డి ఏ బిజెపి పార్టీలు సమైక్య వ్యవస్థకు ప్రతి బంధకాలుగా మారాయి అన్నారు. కేరళ వైనాడ్ లో చోటు చేసుకున్న విపత్తులు సమయంలో ఎంతోమంది మృత్యువాత పడ్డ ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం అందించిన దాఖలాలు లేవన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఉన్న చోట మాత్రమే ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారన్నారు.కార్యక్రమంలో సీపీఎం రాష్ర్ట కార్యదర్శి బి శ్రీనివాసరావు తదితరుల పాల్గొన్నారు.
- Advertisement -