- Advertisement -
భారీ వాహనాల పార్కింగ్ తో వాహనదారులకు ఇబ్బందులు
Difficulties for motorists with parking of heavy vehiclesఆళ్లగడ్డ
శిరివెళ్ల మెట్ట హైవే లో ఉన్న హోటళ్ల వద్ద అడ్డంగా భారీ వాహనాలు నిలుపుదల చేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. పాములేటి హోటళ్ల వద్ద సర్వీసు రోడ్డుపై పైనే భారీ వాహనాలు నిలిపివేస్తున్నారు. గతంలో ఆపోజిట్ రోడ్ లో నరసయ్య హోటల్ వద్ద జరిగిన ద్విచక్ర వాహన ఆక్సిడెంట్ ఇంకా కళ్ళ ముందే ఉంది. సర్వీసు రోడ్డును మొత్తం వాహనలతో అడ్డగోలుగా నిలిపేస్తుంటే ఎదురుగా వచ్చే వాహనాలు కనపడక వాహనదారులు నిత్యం ప్రమాద పాలవుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా పోలీసులు వారిపై ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు చూసి చూడనట్టు వ్యవరిస్తుండడంతో హోటళ్ళ యాజమానుల ఆగడాలకు అడ్డులేకుండా పోతుంది.ఇప్పటికైనా పోలీసులు వాహనాల పార్కింగ్ ను నివారించి హొటల్ యజమానులపై గట్టి చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు….
- Advertisement -




