- Advertisement -
దసరా నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ
Distribution of free gas cylinders from Dussehraగురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వెల్లడి
గురజాల,
: కూటమి ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇంటింటికి వెళ్లి ‘ఇది మంచి ప్రభుత్వం’ కరపత్రాలను పంపిణీ చేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ 100 రోజుల్లో 100కు పైగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని ప్రజలకు వివరించారు.దసరా నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తో పాటు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, టిడిపి, బిజెపి జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -




