కేజీబీవీని పరిశీలించిన జిల్లా కలెక్టర్
కోహెడ
District Collector who inspected KGBV
కోహెడ మండలం తంగళ్ళపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అవసరమైన మౌలిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి తెలిపారు. ఆకస్మత్తుగా కోహెడ మండలంలోని తంగళ్ళపల్లి కేజీబీవీ ని సందర్శించి విద్యాలయంలో విద్యార్థులకు గల సౌకర్యాలను పరిశీలించారు. పదవ తరగతి క్లాస్ రూమ్ లోకి వెళ్లి విద్యార్థుల జీవశాస్త్రం పరిజ్ఞానాన్ని పరిశీలించి ఏదైనా సబ్జెక్టు అర్థం కాకపోతే సంబంధిత ఉపాధ్యాయులకు చెప్పాలని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా విద్యార్థులను వ్యక్తిగతంగా వారి సామర్థ్యాలను పరీక్షించి వారు ఏ సబ్జెక్టులలో వెనుకబడి ఉన్నారో గమనించి ప్రతి నెలలో ఒక్కొక్క సబ్జెక్టు చొప్పున అన్ని సబ్జెక్టులపై ప్రత్యేక క్లాస్ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.
విద్యాలయానికి సిసి రోడ్, డార్మెంటరీ, దోమలు రాకుండా కిటికీలకు జాలి, కొత్త టాయిలెట్స్, బోర్ వెల్, సామూహిక ఇంకుడు గుంత కావాలని విద్యాలయ ప్రిన్సిపాల్ హిమబిందు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా విద్యాలయానికి అత్యవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడతానని జిల్లా కలెక్టర్ తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యాలయం ఆవరణలో మొక్కలు నాటి ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
కలెక్టర్ వెంటా తాసిల్దార్ సురేఖ, ఈడబ్ల్యూఐడిసి ఏఈ సాయి తదితరులు ఉన్నారు.