Tuesday, May 19, 2026

అటవీ పార్కులో రైతులకు  ఆంక్షలు పెట్టొద్దు

- Advertisement -

అటవీ పార్కులో రైతులకు  ఆంక్షలు పెట్టొద్దు

Do not impose restrictions on farmers in the forest park

సందర్శకుల కోసం రిజిస్టర్ ఏర్పాటు చేయాలి

అంబరిపేట పార్కును సందర్శించిన  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల, జనవరి 25:

జగిత్యాల రూరల్ మండలం అంబారిపేటలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్కులో ముఖ్యంగా అంబారిపేట రైతులకు టికెట్ వంటి ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దని పట్టభధ్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అటవీశాఖ అధికారులకు సూచించారు.శనివారం
జగిత్యాల అర్బన్  అంబారిపెట పార్క్ ను పట్టభద్రుల ఎమ్మెల్సీ
జీవన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి,మున్సిపల్ కౌన్సిలర్స్, కాంగ్రెస్ నాయకులతో కలిసి
సందర్శించారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అటవీ శాఖ జగిత్యాల రేంజ్ ఆఫీసర్ పద్మారావు పూలమొక్క అందించి స్వాగతం పలికారు.
నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్సీ
పార్కులో తిరిగి పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్బంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ
ప్రధానంగా అంబారి పేట్ రైతులకు ఏలాంటి ఆంక్షలు పెట్టొద్దన్నారు.
అంబారి పేట్ రైతుల పొలాలకు దారి ఇదేనని చెబుతూ రైతులు పొలం దగ్గరికి వెళ్తే టికెట్ లాంటి ఆంక్షలు విధించరాదన్నారు.
అలాగే పార్కులో ఎంట్రీ, ఎగ్జిట్ రిజిస్టర్ లో ఆధారాలు గల ప్రూఫ్ లాంటి జాగ్రత్తలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే  పార్కులో సెక్యూరిటీ ఉంటుందని జీవన్ రెడ్డి అన్నారు.
పార్కు కు వచ్చిన సందర్శకులకు నీటి సమస్య, తదితర సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఫారెస్ట్ అధికారులకు సూచించారు.
మెడికల్ కిట్ తో పాటు పలు జాగ్రత్తలు తీసుకోవాలని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, బీట్ ఆఫీసర్ శ్రీనివాస్,కౌన్సిలర్లు దుర్గయ్య, హనుమండ్ల జయశ్రీ, నక్క జీవన్,ఆసియా సుల్తానా,కాంగ్రెస్ నాయకులు జున్ను రాజేందర్, రజినీకాంత్,బొల్లి శేఖర్,గిరిధర్, అల్లాల సరిత, రమేష్ రావు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్