వేసవిలో చల్లటి నీటిని ఎక్కువగా తాగితే ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో సూర్యరశ్మి, విపరీతమైన వేడిని నివారించడానికి ప్రజలు తరచుగా చల్లటి పదార్థాలు తినడానికి , త్రాగడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో ప్రజలు చల్లటి నీటిని తాగడానికి ఇష్టపడుతుంటారు. దీన్ని తాగడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. అయితే, చల్లని నీరు అందించే ఉపశమనం కొన్ని క్షణాల వరకు మాత్రమే. కానీ మీ ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. ఇప్పుడు ఆ చల్లటి నీటిని తాగితే కలిగే నష్టాల గురుంచి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
జీర్ణ సమస్యలు
చల్లటి నీరు మీ జీర్ణవ్యవస్థను వేగంగా ప్రభావితం చేస్తుంది. క్రమం తప్పకుండా చల్లటి నీటిని తాగడం వల్ల ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది. కడుపు నొప్పి, వికారం, మలబద్ధకం, అపానవాయువు వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది.
తలనొప్పి, సైనస్
మీరు తరచుగా శీతల పానీయాలను అవసరానికి మించి తాగితే అది ‘బ్రెయిన్ ఫ్రీజ్’ సమస్యకు కూడా కారణం కావచ్చు. ఐస్ వాటర్ తాగడం లేదా ఐస్ క్రీం ఎక్కువగా తినడం వల్ల కూడా ఇది జరుగుతుంది. నిజానికి చల్లని నీరు వెన్నుపాము సున్నితమైన నరాలను చల్లబరుస్తుంది.
నెమ్మదిగా గుండె కొట్టుకోవడం
మన శరీరంలో ఒక వాగస్ నాడి ఉంటుంది. ఇది మెడ ద్వారా గుండె, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థను నియంత్రిస్తుంది. మీరు చల్లటి నీటిని ఎక్కువగా తాగితే అది మీ నరాలను వేగంగా చల్లబరుస్తుంది. దీంతో హృదయ స్పందన రేటు, పల్స్ రేటును తగ్గిస్తుంది.
బరువు పెరగడం
మీరు బరువు తగ్గాలనుకుంటే..పొరపాటున కూడా చల్లని నీరు త్రాగకండి. నిజానికి చల్లటి నీటిని తాగడం వల్ల మీ శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు గట్టిపడుతుంది. ఇది కొవ్వును కరిగించడాన్ని కష్టతరం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు బరువు తగ్గడం చాలా కష్టం.