వరదలపై అలసత్వం వద్దు
Don't be complacent about floodsఅధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష
భద్రాద్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరావు సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో గోదావరి వరదల సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా జిల్లాలో ఉన్న అన్ని శాఖల అధికారులు సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మంత్రి తుమ్మల అధికారులతో మాట్లాడుతూ గోదావరి నది 70 అడుగులు వచ్చినా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగవద్దని ఆ విధంగా చర్యలు చేపట్టాలని ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని అవసరమైతే గతంలో వరదలు వచ్చినప్పుడు ఇక్కడ పని చేసిన అధికారులను ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అడిగి తెలుసుకుని ప్రజలకు సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా మొట్టమొదటిసారి భద్రాచలం పట్టణంలో వర్షం కారణంగా వరద వచ్చింది కానీ గోదావరి నీరు మాత్రం పట్టణంలోకి రానీయకుండా అధికారులు చర్యలు చేపట్టారని అధికారులు అందరికీ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు
అంతేకాకుండా దుమ్ముగూడెం చర్ల వంటి ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి పాఠశాలలు మరియు హాస్టల్స్ ఏవైనా వరద ముంపు కి గురి అయితే వెంటనే అక్కడున్న విద్యార్థులకు సహాయ సహకారాలు అందించే విధంగా ఐటీడీఏ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న జితేష్ వి పాటిల్ కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి అని కాబట్టి అధికారులు అందరూ ఏది కావాలి అన్న అతనిని అడిగి పనిచేయించుకోవాలని లేదా నాతో చెబితే కలెక్టర్ కి చెప్పి ఆ పనులను చేయిస్తానని ఆయన అన్నారు అనంతరం జిల్లాలో పనిచేస్తున్న ఎస్పి రోహిత్ రాజ్ కూడా జిల్లాను శాంతి భద్రతల జిల్లాగా తీర్చిదిద్దరు ముందడుగు వేస్తున్నారని దానికి అందరూ సహకరించాలని అంతేకాకుండా శాంతిభద్రతలకు వికాటం కలిగించే వారందరూ కూడా ఆలోచన చేసుకుని శాంతి భద్రతలను కచ్చితంగా పాటించాలని లేకపోతే వారి పని వారు చేసుకుని పోతారని భద్రతలకు ఎవరైతే వివాదం కలిగించే వారు ఉన్నారు ఇది ఒక హెచ్చరిక అని ఆయన అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తి వ్యవసాయ జిల్లాలని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొన్న జరిగిన విపత్తులో కూడా ప్రభుత్వం తక్షణ సహాయం అందించడానికి కూడా చర్యలు చేపట్టారని ఖమ్మంలో అకాల వర్షానికి పొంగిన మున్నేరు వలన ఎంతో మంది కుటుంబాలు రోడ్డున పడటం జరిగిందని వారందరికీ ప్రజా ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు




