అధైర్య పడొద్దు అండగా ఉంటా….

- Advertisement -
  • dont-be-impatient-i-will-be-with-you
    dont-be-impatient-i-will-be-with-you

    భారీ వర్షాలతో  తల్లడిల్లుతున్న ప్రజల కోసం “నేను  సైతం”…

  • అంటు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు  సుడిగాలి పర్యటన..
  • ఆధైర్య పడొద్దు అండగా ఉంటాం
  • వరదల వల్ల ముంపునకు గురైన బాదితులను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రెవెన్యూ సిబ్బందికి సూచించిన కొండా మురళీధర్ రావు ..

వరంగల్ తూర్పు నియోజకవర్గం: గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనీ కాశీకుంట, డీకే నగర్, విద్యానగర్, పలు డివిజన్లు, ముంపుకు గురైనా లోతట్టు ప్రాంతాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్సీ “కొండా మురళీధర్ రావు” గారు మాట్లాడుతూ.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ముంపుకు గురైనా ప్రాంతాలు జలమయమై ఇళ్లలోకి నీరు చేరి ప్రజలంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో వరంగల్ తూర్పు స్థానిక శాసన సభ్యుడు జన పరిరక్షణ గాలికి వదిలేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన కనీస బాధ్యత మరిచి పట్టి పట్టనట్లు వ్యవహరించడం సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియజేస్తూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనీ పలు డివిజన్ లోని స్థానిక వీధిలోని ఇండ్లు మొత్తం జలమయమై ఇండ్లలోకి నీరు చేరి వారి నిత్యావసర వస్తువులతో పాటు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తడిచి ఆర్థిక నష్టం వాటిల్లినది కావున ఇవాళ ముంపునకు గురైన బాధితులను రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం జిల్లా అధికారులు ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదని అలాగే ముంపునకు గురైనా కుటుంబాలకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు గారు నిత్యవసర సరుకులు కూరగాయలు, దుప్పట్లు పంపించడం జరిగింది… ఈ పర్యటన లో తూర్పు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మీడియా మిత్రులు పాల్గొన్నారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular