Sunday, September 8, 2024

డౌన్ డౌన్ కొడాలి నాని… జై చిరంజీవ అంటూ నినాదాలు

- Advertisement -
Down down Kodali Nani... Jai Chiranjeeva chanted slogans
Down down Kodali Nani… Jai Chiranjeeva chanted slogans

గుడివాడలో మెగాస్టార్ అభిమానుల ఆందోళన

గుడివాడ: మెగాస్టార్ చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కృష్ణాజిల్లా గుడివాడలో  చిరంజీవి అభిమానులు చేసిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. డౌన్ డౌన్ కొడాలి నాని… జై చిరంజీవ అంటూ నినాదాలు చేస్తూ పట్టణ పుర వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తున్న చిరంజీవి అభిమానులను విజయవాడ వన్ వే రోడ్డులో పోలీసులు అడ్డుకోవడంతో కోపోద్రోక్తులైన అభిమానులు కొడాలి నాని క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అభిమానుల ర్యాలీని పోలీసులు ముందుకు వెళ్ళనీయకపోవడంతో ఇరువర్గాల మధ్య భారీ తోపులాట జరిగింది. ఆందోళన అడ్డుకునే క్రమంలో చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవి, జనసేన పార్టీ ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్ తోపాటు పలువురు అభిమానులను పోలీసులు అరెస్టు చేయడంతో,  పోలీసు వాహనాలను ముందుకు వెళ్ళనీయకుండా అభిమానులు అడ్డంగా పడుకున్నారు. భారీగా చేరుకున్న అభిమానులను అదుపు చేయలేకపోయిన పోలీసులు, ముఖ్య నాయకులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్