రెండవ తేదీ నుంచి దసరా సెలవులను ప్రకటించాలి…

- Advertisement -

రెండవ తేదీ నుంచి దసరా సెలవులను ప్రకటించాలి…

 

పిఆర్టియు జిల్లా కార్యదర్శి అంగడి లోకేష్

Dussehra holidays should be declared from the second date of...

తుగ్గలి
దసరా సెలవులను అక్టోబర్ 4కు బదులుగా అక్టోబర్ 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ పిఆర్టియు తరఫున పిఆర్టియు జిల్లా కార్యదర్శి అంగడి లోకేష్ పాఠశాల విద్యా కమిషనర్ ను కోరారు.ఈ సందర్భంగా పిఆర్టియు జిల్లా కార్యదర్శి అంగడి లోకేష్ మాట్లాడుతూ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం దసరా సెలవులు అక్టోబర్ 4 నుండి 13వ తేదీ వరకు కలవు.అక్టోబర్ 2న గాంధీ జయంతి, అక్టోబర్ 3న మహాలయ అమావాస్య ప్రారంభం,పితృదేవతలకు తర్పణాలు పూజలు నిర్వహించవలసి వస్తుంది. అక్టోబర్ 3 పని దినం కారణంగా ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురి అవుతున్నారు.కావున పాఠశాల విద్యా కమిషనర్ ఉపాధ్యాయుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని అక్టోబర్ 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులు స్వల్ప మార్పులు చేసి ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ కోరుతుందని పిఆర్టియు జిల్లా కార్యదర్శి అంగడి లోకేష్ తెలియజేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular