వడ్డేమాన్, దామగట్ల లో ఈసీసీఈ డే కార్యక్రమం
ECCE Day program in Vaddeman, Damagatla
దామగట్లలో హాజరైన సిడిపిఓ కోటేశ్వరి
నందికొట్కూర్
ప్రతినెలా 5వ తేదీన అంగన్వాడీ కేంద్రాలలో బాల్య సంరక్షణ మరియు విద్య( ఈసీసీఈ) దినోత్సవాన్ని జరుపుకుంటారని నందికొట్కూర్ సిడీపీఓ కోటేశ్వరి తెలిపారు. శనివారం మండల పరిధిలోని వడ్డేమాన్ మరియు దామగట్ల గ్రామాల్లో ఐసిడిఎస్ సూపర్వైజర్ వెంకటేశ్వరమ్మ మరియు గ్రామ సర్పంచ్ మాధవరం సుశీలమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లల సమగ్ర అభివృద్ధి గురించి తెలుసుకోవడానికి ప్రతి నెల 5వ తేదీన ఒక అవకాశం ఉంటుందన్నారు. ఈసీసీఈ అనేది బాల్య విద్య మరియు అభివృద్ధి యొక్క ప్రాముఖ్యతను హైలెట్ చేసే గ్లోబల్ ఈవెంట్ అని రక్షిత వాతావరణం లో పిల్లలు ప్రతి స్పందించే సంరక్షణ మరియు ముందస్తు అభ్యాసాన్ని పొందేలా చూడడం దీని లక్ష్యం అన్నారు. చిన్నపిల్లల్లో మూడు సంవత్సరాల లోపు పిల్లలకు మెదడు అభివృద్ధి వేగంగా జరుగుతుందని మరియు శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, బాగోద్వేగా అభివృద్ధి ఇవన్నీ బాగా స్కిల్ డెవలప్మెంట్ అంగన్వాడీ సెంటర్లలో అందించడం ద్వారా బాగా డెవలప్మెంట్ ఉంటుందని తల్లులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వడ్డేమాన్ అంగన్వాడీ కార్యకర్తలు శెట్టి లలితమ్మ, గాదె వెంకట రవణమ్మ, ఇందిరమ్మ , దామగట్ల అంగన్వాడీ కార్యకర్తలు ప్రభావతి ,సుజాత ,రత్నకుమారి గోకారమ్మ, అంగన్వాడీ ఆయాలు శ్రీలక్ష్మి, మమత ,సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు