బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలి
జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
జగిత్యాల
పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు.. మంగళవారం
జగిత్యాల పట్టణ, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను
జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
ఆకస్మిక
తనిఖీ చేశారు..
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ స్టేషన్ పరిసరాలను తోపాటు పోలీస్ స్టేషన్ ఆవరణలో వాహనాల పార్కింగ్ ప్రదేశాలు రిసెప్షన్, స్టేషన్ రైటర్,ఎస్ హెచ్ వో, రెస్ట్ రూమ్ , లాక్ అప్ రూమ్ ను పరిశీలించారు.
అలాగే కోర్టు విధులు నిర్వహించే అధికారుల రూమ్ లో రికార్డ్స్ భద్రపరచుట, 5 ఎస్ అమలు తీరును పరిశీలించారు.పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో
పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ ఎన్ని బిట్స్ నడుస్తున్నాయని తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ
దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24×7 గస్తీ నిర్వహించాలని ,
సిబ్బంది తమకు కేటాయించిన కాలనీల పూర్తి సమాచారం సిబ్బంది అందరి దగ్గర ఉండాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం
చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలతోపాటు యువతను అప్రమత్తం చేయాలని సూచించారు.
టౌన్ ఇన్స్పెక్టర్
నటేష్, ట్రాఫిక్ ఎస్ఐ రామచంద్రo, సిబ్బంది పాల్గొన్నారు