9.4 C
New York
Saturday, April 13, 2024

మాకు ఎన్నికలు ముఖ్యం కాదు.. మహిళలు, పేదల రక్షణ ముఖ్యం.

- Advertisement -

మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధి చెంగిచెర్ల లో గత రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణలో గాయపడ్డ కుటుంబాలను కేంద్ర పర్యావరణ , ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.‌ కిషన్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ పరామర్శించారు …

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ..

మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ లక్ష్యంగా హిందూ మహిళలపై అర్ధరాత్రి మతోన్మాదులు దాడికి వ్యవహరించిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఆటవిక చర్య.

మహిళలు ఆచారం ప్రకారం హోలీ పండుగ చేసుకుంటుంటే.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొంతమంది మతోన్మాదులు మహిళలతో ఘర్షణకు దిగి దాడికి పాల్పడ్డారు. మహిళలపై దుర్భాషలాడుతూ మూకుమ్మడిగా రాళ్లతో కొట్టారు. ఈ ఘటనలో అనేకమందికి గాయపడ్డారు.

ఈ దాడిలో గర్భిణీలతో పాటు మహిళలకు తలలు పగిలి తీవ్రగాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.

ఘటన జరిగి 24 గంటలు దాటినా పోలీసులు దోషులను పట్టుకోకుండా, కేసులు నమోదు చేయకుండా వివక్షపూరితంగా వ్యవహరించడం దుర్మార్గం.

దాడికి సంబంధించి వీడియోల్లో కనపడుతున్నా పోలీసులు కేవలం దర్యాప్తు పేరుతో కాలయాపన చేయడం సబబు కాదు.

ఇప్పటికైనా దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలి. హత్యానేరం కింద కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం.

పోలీసుల కళ్ళెదుటే మతోన్మాదులు విచక్షణ కోల్పోయి హిందూ మహిళలపై, పిల్లలపై దాడి చేస్తున్నప్పటికీ ప్రేక్షక పాత్ర వహించారు.

ఓవైపు ఎలక్షన్ కోడ్ ఉన్నా.. దాడులు జరిగినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని ఖండిస్తున్నాం.

స్లాట్ హౌస్ ఏరియాలో మజ్లిస్ పార్టీ అండతో మతోన్మాదులు మాఫియాగా ఏర్పడి రెచ్చిపోతున్నారు.

మహిళలు, బాలింతలు అని చూడకుండా గిరిజనులపై దాడులకు తెగబడ్డారు. బాధిత గిరిజన మహిళల పట్ల బాధ్యతగా వ్యవహరించకుండా ఆసుపత్రిలో ఔట్ పేషెంట్ గా నామమాత్రంగా ట్రీట్ మెంట్ ఇస్తారా..?

హిందువుల పట్ల గూండాలు చేసిన దాడిని నిలువరించడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారు.

ఈ ఘటన వెనుక చెంగిచర్లకు సంబంధించిన స్లాట్ హౌస్ మాఫియా ఉంది.

కొంతమంది నేర సామ్రాజ్యాన్ని స్థాపించి నేరాలకు పాల్పడుతున్నారు.

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాస్తూ, వాళ్ల అవసరాలు తీరుస్తూ పూర్తిగా చట్టవ్యతిరేకంగా స్లాటర్ హౌస్ పేరిట కార్యకలాపాలు చేస్తున్నారు.

ఆవులను, గోవులను హత్య చేస్తుంటే పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదు.. గతంలో దీన్ని అడ్డుకున్న మాపై కూడా దాడికి తెగబడ్డారు.

స్లాటర్ హౌస్ మాఫియాపై పోలీసులు కేసులు నమోదు చేయకుండా పేదవారి నోరునొక్కడం దుర్మార్గం.

హిందూ స్త్రీలపై జరిగిన మాఫియా దాడి ఇది.

ఈ విషయాన్ని కేంద్ర ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. బాధితులకు న్యాయం జరగకుంటే ఎంతవరకైనా పోరాడుతాం.

ఓదిక్కు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లో పేద మహిళలపై దాడులు జరుగుతుంటే ఎందుకింత వివక్షంగా వ్యవహరిస్తోంది..?

బాధితులకు మేం అండగా ఉంటాం.. అన్ని రకాలుగా పోరాటం చేస్తాం.

మాకు ఎన్నికలు ముఖ్యం కాదు.. మహిళలు, పేదల రక్షణ ముఖ్యం.
ఇల్లీగల్ గా స్లాటింగ్ చేస్తూ.. ఎక్స్ పోర్ట్ చేస్తూ… ప్రభుత్వం యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని మాఫియా రాజ్యాన్ని స్థాపించుకున్నారు.

ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి, వాటిని పేదవారికి ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారికి, మాఫియాకు చెందినవారికి కేటాయించారు.

ఈ స్లాటర్ హౌస్ ను వెంటనే మూసివేయించాలని డిమాండ్ చేస్తున్నాం.

24 గంటల్లోగా దోషులను పట్టుకొని హత్యానేరం కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయకుంటే సహించేది లేదని హెచ్చరిస్తున్నాం.

మరో వర్గంపై ఇలాంటి దాడులు జరిగితే పోలీసులు ఇలానే వ్యవహరిస్తారా..?

హిందువులు, పేదవారు కాబట్టి పోలీసులు నిర్లక్ష్యంగా, వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.

ఈ దురంతాన్ని బయట ప్రపంచానికి తెలపాల్సిన అవసరం ఉంది. బాధితులకు న్యాయం జరిగేంతవరకు, దోషులను శిక్షించేంత వరకు మేం పోరాటం చేస్తాం.

మహిళలపై కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది..?

పండుగ జరుపుకుంటున్న వారిని బెదిరించి, అవమానించి దాడులు చేస్తే… దోషులపై కాకుండా, బాధితులపై కేసు నమోదు చేయడం దుర్మార్గం.

ఇలాంటి తీరు సరికాదని పోలీసులను హెచ్చరిస్తున్నాం. ఏ మాఫియాకు, నాయకులకు భయపడకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

దోషులపై ట్రైబల్ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేసి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!