Monday, March 30, 2026

వరద ప్రాంతాన్ని పరిశీలించిన ఏలూరు ఐజీ

- Advertisement -

వరద ప్రాంతాన్ని పరిశీలించిన ఏలూరు ఐజీ

Eluru IG inspected the flood area

ఏలూరు
అదివారం నాడు ఏలూరు రూరల్ మండలం పెద్ద ఎడ్ల గాడి ప్రాంతంలో వరద పరిస్థితిని ఏలూరు రేంజ్ ఐజి జివిజి అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ  కె ప్రతాప్ శివ కిషోర్, డిఎస్పి డి శ్రావణ్ కుమార్,  వన్ టౌన్ ఇన్స్పెక్టర్

సత్యనారాయణ సిబ్బంది పరిశీలించారు. ఈ సందర్భంగా ఐజి  మాట్లాడుతూ ఎగువ ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బుడమేరు, వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ కొల్లేరు పరివాహక

ప్రాంతాలలో నీరు అధికంగా వచ్చి చేరుట వలన కృష్ణాజిల్లా పశ్చిమగోదావరి జిల్లా మరియు ఏలూరు జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాలలో నీరు అధికంగా చేరుట వలన పోలీసు సిబ్బంది లోతట్టు ప్రాంతాలలో నివాసం

ఉంటున్న  ప్రజలను సురక్షిత ప్రాంతాలకు  తరలించి  రెవెన్యూ వారి యొక్క సహాయ సహకారాలతో పునరావాస కేంద్రాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా

చూస్తున్నారని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారని  రోడ్డుపై ప్రవహిస్తున్న నీటిని ప్రజలు దాటకుండా ఉండేలాగా అన్ని ప్రాంతాలలో పోలీస్ బందోబస్తు లను ఏర్పాటు

చేసినట్లు రహదారులపై బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చూస్తున్నట్లుగా అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్