Wednesday, May 20, 2026

కళాతోరణానికి అంతా రెడీ

- Advertisement -

కళాతోరణానికి అంతా రెడీ

Everything is ready for Kalathoranam

వరంగల్, జనవరి 27, (వాయిస్ టుడే)
వరంగల్‌ కాకతీయ కళాతోరణం.. తెలంగాణ చరిత్రలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ అద్భుత నిర్మాణం కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు.. కాకతీయ రాజవంశం ఘన చరిత్ర, కళాత్మక నైపుణ్యం, శిల్పకళా వైభవానికి నిదర్శనం. అంతటి ప్రాధాన్యం గల కాకతీయ కళాతోరణం గురించి 7 ఆసక్తికరమైన విషయాలు ఇలా ఉన్నాయి.వరంగల్ కాకతీయ కళాతోరణం.. 12వ శతాబ్దంలో కాకతీయ రాజుల కాలంలో నిర్మించారు. ఈ కళాతోరణం వరంగల్ కోటలోని శివాలయానికి ప్రవేశ ద్వారంగా ఉండేది. కాకతీయ రాజులు తమ శక్తి, సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఈ అద్భుతాన్ని నిర్మించారు. వరంగల్ కోట నాలుగు దిక్కులా ఉన్న ప్రధాన ద్వారాలను కలుపుతూ.. గణపతి దేవుడు ఖిల్లా వరంగల్‌‌‌‌ చుట్టూ 15 మీటర్ల ఎత్తయిన రాతి గోడను నిర్మించారు. ఈ గోడపై బురుజులు కూడా ఉన్నాయి. ఈ ద్వారాలను కాకతీయ కళాతోరణాలు, కీర్తి తోరణ శిల్పాలుగా పిలుస్తున్నారు.  కాకతీయ కళాతోరణాలు కేవలం అలంకారం కోసం చేసిన డిజైన్‌ కాదు. దాని మీద కాకతీయుల పాలనా వైభవమంతా పూసగుచ్చినట్టుగా ఉంటుంది. వాళ్ల ఏలుబడిలో ఏయే అంశాలకు ప్రాధాన్యమిచ్చారో ఈ తోరణాలు తెలియజేస్తాయి. నిలబడ్డ నాలుగు పిల్లర్లు వాళ్ల పాలనలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందనడానికి నిదర్శనం.   హంసలు, మొసళ్లు, పద్మాలు, మొకలు, తలకిందులుగా వేలాడినట్టుండే తామెర మొగ్గల వంటి ఆకృతులు.. ఇలా ఎన్నో అంశాల కలబోత వరంగల్‌ కాకతీయ తోరణాలు. ఈ శిల్పాలు కాకతీయ శిల్పుల కళా నైపుణ్యానికి నిదర్శనంకాకతీయుల ధైర్య సాహసాలకు నిదర్శనంగా ఈ కళాతోరణాలు నిలుస్తాయి. ఢిల్లీ సుల్తానులపై కాకతీయ సేనలు చేసిన యుద్ధం గురించి.. గొడిశాలలో ఉన్న కాకతీయుల కళాతోరణం తెలుపుతోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్