హైదరాబాద్, ఆగస్టు 24: ఫిడే చెస్ వరల్డ్ కప్ ఫైనల్ హోరాహోరీగా సాగింది. గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద , ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ మధ్య ఫైనల్ పోరు హాట్ హాట్గా జరిగింది. తొలి రెండు గేములు డ్రా అయ్యాయి. ఈ నేపథ్యంలో టై బ్రేకర్ తప్పనిసరి అయింది. ఆగస్టు 24వ తేదీన జరిగే టై బ్రేకర్లో ప్రజ్ఞానంద మాగ్నస్ కార్ల్‌సన్తో తలపడ్డాడు. ఈ నేపథ్యంలో ప్రజ్ఞానంద టైటిల్ గెలిస్తే భారీగా ప్రైజ్ మనీ అందుకోనున్నాడు. చెస్ ప్రపంచ కప్ గెలిచిన వారికి భారీగా ప్రైజ్ మనీ అందనుంది. విజేతకు 1.1 లక్షల డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.90.93 లక్షలు దక్కనున్నాయి. రన్నరప్ కు 80 వేల డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.66.13 లక్షలు అందుతాయి. చెస్ వరల్డ్ కప్ మొత్తం ప్రైజ్ మనీ రూ.15.13 కోట్లు. ప్రజ్ఞానంద , మాగ్నస్ కార్ల్‌సన్ మధ్య జరిగిన తొలి గేమ్ 35 ఎత్తుల్లో డ్రా అయింది. రెండో గేమ్లో కూడా 30 ఎత్తుల తర్వాత ఇద్దరు ప్లేయర్స్ డ్రాకు అంగీకరించారు. అయితే క్లాసికల్ గేమ్స్లో ఎవరు విజేతో తేలలేదు. దీంతో ర్యాపిడ్ ఫార్మాట్ నిర్వహిస్తారు. ఇందులో కూడా తేలకపోతే బ్లిట్జ్ ద్వారా విన్నర్ను డిక్లేర్ చేస్తారు. టై బ్రేకర్ ర్యాపిడ్ ఫార్మాట్లో జరుగుతుంది. ఈ ఫార్మాట్లో ఒక్కో ప్లేయర్ కు 25 నిమిషాల టైమ్ కంట్రోల్ ఉంటుంది. ఒక్కో ఎత్తుకు 10 సెకన్ల పెంపును అందుకుంటారు. ఒకవేళ ఇందులోనూ విజేత తేలకపోతే బ్లిట్జ్ గేమ్ ద్వారా విజేతను తేలుస్తారు.