Thursday, April 10, 2025

27 రూపాయిలు ఎక్కువకు అమ్మినందుకు .27 లక్షల 27 వేల రూపాయలు జరిమానా

- Advertisement -

27 రూపాయిలు ఎక్కువకు అమ్మినందుకు
.27 లక్షల 27 వేల రూపాయలు జరిమానా
రాజమండ్రి, మార్చి 8, (వాయిస్ టుడే)

Fine of 27 lakh 27 thousand rupees for selling at a price of 27 rupees more

ఎమ్మార్పీకి మించి అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తే చర్యలు తప్పవు అని హెచ్చరిస్తుంటారు అధికారులు. ఈ క్రమంలో అధిక ధరలకు వాటర్ బాటిల్స్ విక్రయించిన హోటల్ యాజమాన్యానికి ఏకంగా రూ.27 లక్షల జరిమానా విధించారు. నిర్ణీత ధరల కంటే అధిక ధరలకు ఉత్పత్తులు విక్రయించడం నేరమేనని, వినియోగదారులు తమ హక్కులు తెలుసుకుని న్యాయం కోసం ప్రశ్నించాలని అధికారులు సూచించారు.కుసుమ కళ్యాణ్ అనే వ్యక్తి హైదరాబాద్ ట్యూలిప్స్ గ్రాండ్ హోటల్ లో ఇటీవల 3 వాటర్ బాటిల్స్ కొన్నారు. వాస్తవానికి ఒక్కో లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.20 కాగా, మూడు వాటర్ బాటిల్స్ ధర రూ.60 అవుతుంది. కానీ హోటల్ సిబ్బంది కస్టమర్ నుంచి అధికంగా వసూలు చేశారు. ఎమ్మార్పీ కంటే 27 రూపాయలు అదనంగా వసూలు చేశారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు వాటర్ బాటిల్స్ విక్రయించడంపై కస్టమర కుసుమ కళ్యాణ్ కాకినాడలో వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. హోటల్ హైదరాబాదులో ఉన్న వినియోగదారుడు తన ప్రాంతం కాకినాడ కనుక, ఎక్కడైనా కేసులు వేయవచ్చు అని కాకినాడ వినియోగదారుల ఫోరం కమిషన్ సభ్యురాలు సుశి తెలిపారు. ఒక్కో వాటర్ బాటిల్ నిర్ణీత రుసుము రూ.20 కాగా, కస్టమర్ నుంచి 29 రూపాయలు .. మొత్తం మూడు బాటిల్స్ కు రూ.87 తీసుకున్నారు హాటల్ సిబ్బంది. రూ.27 అదనగా తీసుకున్నారని.. ఇది అన్యాయమని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.  బాధితుడి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ లోని హాటల్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినా స్పందించలేదని అధికారిణి సుశి తెలిపారు. దాంతో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు చేస్తున్న హాటల్ మేనేజ్ మెంట్‌కు రూ.27 లక్షల 27 వేల రూపాయలు జరిమానా విధించినట్లు ఆమె తెలిపారు. 25 లక్షలు తెలంగాణ సీఎం సహాయ నిధికి, వినియోగదారుడికి 25000, హోటల్ యజమాన్యం కోర్టుకి 2000 చెల్లించాలని కాకినాడ వినియోగదారుల ఫోరం కమిషన్ అధ్యక్షులు రఘుపతి, మెంబర్ సుశి ఆదేశించారు. హైదరాబాద్‌లో జరిగినా వినియోగదారుడు కాకినాడకు చెందిన వ్యక్తి కనుక ఇక్కడ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో అయినా ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రశ్నించేతత్వం లేకపోతే నష్టం జరుగుతుంది. ఇలాంటి జడ్జిమెంట్ ద్వారా ఎమ్మార్పీ ధరలకు విక్రయాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు ఏది విక్రయించినా నేరమే అవుతుంది. అందుకే మేం నోటీసులు జారీ చేశాం. మీడియా ద్వారా విషయం చెబితే అందరికీ తమకు జరుగుతున్న అన్యాయం గురించి అవగాహనా వస్తుంది. వేగంగా మూడు నెలల్లో వినియోగదారుల సమస్య పరిష్కరించాలని కన్జూమర్ ఫోరమ్ యాక్ట్ లో ఉంటుంది. మేం జడ్జిలం కాదు. కానీ మాకు ఉన్న అధికారంతో వినియోగదారుల సమస్యను పరిష్కరిస్తాం.’ అని ఫోరమ్ అధికారిణి సుశి తెలిపారు.కుసుమ కళ్యాణ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హైదరాబాద్ లో హాటల్ ట్యులిప్ గ్రాండ్ లో ఫ్రెండ్స్ తో కలిసి భోజనం చేశాడు. అధిక ధరలకు విక్రయంచడాన్ని ప్రశ్నిస్తే యాజమాన్యం పట్టించుకోలేదని కాకినాడ వినియోగదారుల ఫోరం కమిషన్ అధ్యక్షులు రఘుపతి తెలిపారు. గతంలో పలు రాష్ట్రాల్లోనూ ఇలాంటి కేసులు నమోదయ్యాయని, ఒక్క రూపాయి కంటే అధికంగా వసూలు చేసినా.. ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్