4.1 C
New York
Thursday, February 22, 2024

జిల్లా పోలీస్ అధికారులకు,సిబ్బందికి  ఫైరింగ్ ప్రాక్టీస్

- Advertisement -

జిల్లా పోలీస్ అధికారులకు,సిబ్బందికి  ఫైరింగ్ ప్రాక్టీస్

జగిత్యాల,
జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి సోమవారం జిల్లాలో ఏర్పాటు చేసిన  ఫైరింగ్ రేంజ్ నందు ఫైరింగ్ శిక్షణ ఇచ్చి ఫైరింగ్ ప్రాక్టీస్ చేయించారు.. శిక్షణలో భాగంగా జిల్లాలో పని చేస్తున్న సిబ్బందికి ఇచ్చే ఫైరింగ్ శిక్షణ ను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సందర్శించి సిబ్బందికి ఇచ్చే ఫైరింగ్ శిక్షణ ను పర్యవేక్షించారు.ఈసంధర్భంగా ఎస్పీ కూడా ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు.ఆనంతరం  ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు  పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ కూడా  అధునాతన టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవడం తో పాటుగా అన్ని రకాల ఆయుధ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలని, సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ శిక్షణలో నేర్పించిన మెలకువులను శ్రద్ధతో అభ్యసించి సమయానుకూలంగా శాంతి భద్రతలు పరిరక్షణకు ఉపయోగించాలని అన్నారు. ఫైరింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులను సిబ్బందిని  ఎస్పీ అభినందించారు.
ఈ శిక్షణలో అడిషనల్ ఎస్పీలు ప్రభాకరరావు , భీమ్ రావు, డీఎస్పీలు వెంకట స్వామి, రవీంద్ర రెడ్డి, రవింద్ర కుమర్,రంగ రెడ్డి,ఎస్భీ, సీసీఎస్ ఇన్స్పెక్టర్ లు నాగేశ్వర్ రావు, వేంకటేశ్వర్లు,రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ లు జానిమియా,వేణు సి.ఐలు  రిజర్వ్ ఎస్సైలు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!