నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు మృతి
నారాయణపేట జిల్లా డిసెంబర్ 24
నారాయణపేట జిల్లాలో కొద్దిసేపటి క్రితం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
ఆదివారం సాయంత్రం నారాయణ పేట జిల్లాలోని మక్తల్ మండలం జక్లేర్ జాతీయ రహదారిపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయ పడగా.. వారి పరిస్థితి విషమంగా ఉంది.
స్థానికుల ద్వారా సమా చారం అందుకున్న పోలీ సులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
మృతులు కర్నాటక, మహా రాష్ట్ర చెందిన వారిగా గుర్తిం చారు. ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యా యి. యాక్సిడెంట్ కావడం తో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది



