గ్రేటర్ హైదరాబాద్ పై గురి…
హైదరాబాద్, మార్చి 23
పరేషన్ గ్రేటర్ పేరుతో ముందుకు వెళ్తోంది హస్తం పార్టీ. చేవెళ్ల, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ మూడు సీట్లలోనూ.. బీఆర్ఎస్ నుంచి చేరి వారికే టికెట్లు కేటాయించింది. ఆర్థిక బలంతో పాటు, ప్రజాబలం ఉన్న వారిని పార్టీలో చేర్చుకుని.. మూడు ఎంపీలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా.. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతోనూ మంతనాలు జరుపుతున్నారు కాంగ్రెస్ నేతలు. తాజాగా మేయర్, గ్రేటర్ కార్పొరేటర్లపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి సహా 10మందికి పైగా కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరగా.. మరో 13మంది హస్తం గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.కార్పొరేటర్లే కాదు.. GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మిని చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్. ప్రస్తుతం బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్‌గా ఉన్న కేశవరావు కూతురు.. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి. మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇక కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న దివంగత ప్రియరంజన్ దాస్ మున్షీతో కేకేకు మంచి సంబంధాలున్నాయి.పాత రాజకీయ పరిచయాలతో కేకే కుటుంబంతో మున్షీ సంప్రదింపులు జరుపుతున్నారు. కాంగ్రెస్‌లోకి రావాలని కేకే కుటుంబాన్ని ఆహ్వానించారు దీపాదాస్ మున్షీ. తాను పార్టీ మారే పరిస్థితి లేదని.. మేయర్ విజయలక్ష్మి చెబుతున్నా, పార్లమెంట్ ఎన్నికల ముందే.. గ్రేటర్ బిగ్ న్యూస్ చూస్తారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల గెలుపుతో ఇక పార్లమెంట్ లో సత్తా చాటాలని భావిస్తోంది కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ గ్రేటర్ మాత్రం ఆశించిన సీట్లు రాబట్టలేకపోయింది. దీంతో గ్రేటర్ గురి పెట్టింది కాంగ్రెస్.
గ్రేటర్ హైదరాబాద్ పై గురి…
- Advertisement -
- Advertisement -