వివాదంలో ఫోక్ సింగర్…

- Advertisement -

వివాదంలో ఫోక్ సింగర్
కరీంనగర్, ఆగస్టు 19

Folk singer Eshwar Sai in a controversy.

తెలంగాణ జానపద కళాకారుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాసింగ బలాలు ఫేమ్ ఈశ్వర్‌ సాయి కుటుంబ వివాదం వైరల్‌గా మారుతోంది. మంచి చార్ట్‌బస్టర్‌ సాంగ్‌తో అన్ని వర్గాల ప్రజలకు చేరవైన ఈశ్వర్‌ సాయి వ్యక్తిగత జీవితం చిక్కుల్లో   పడింది. మరో మహిళా ఫోక్ ఆర్టిస్‌తో సన్నిహితంగా ఉంటూ తన భార్యకు దొరికిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రెడ్డి వన్‌లో మంగళవారం రాత్రి కలకలం రేగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈశ్వర్‌ సాయి మరో మహిళా ఫోక్‌ డ్యాన్సర్‌తో కలిసి ఒక గదిలో ఉన్న సమయంలో ఆయన భార్య అక్కడికి చేరుకున్నారు. ఆ గదిలోకి వెళ్లిన సమయంలో కనిపించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలప్రకారం ఒక యువతి బెడ్‌పై కూర్చొని ఉండగా, ఈశ్వర్ సాయి బాత్రూమ్‌ నుంచి వస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో అక్కడ ఉన్న వారి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది.
వేములవాడ క్షేత్ర సాధారణంగా భక్తులతో కళకళలాడుతుంటూ ఉంటుంది. కానీ అకస్మాత్తుగా ఈ వివాదం బయటపడటంతో స్థానికంగా కలకలం రేగింది. పక్కా సమాచారంతో ఈశ్వర్ సాయి భార్య అక్కడికి చేరుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియో క్లిప్స్‌ ద్వారా ఈ మొత్తం సీన్ బహిర్గతమైంది. గదిలో తన భర్తను మరో మహిళతో చూసిన భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, వారి మధ్య వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేారు. ఆమె ఫిర్యాదు మేరకు  వివాదం ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఈశ్వర్ సాయి ఇటీవలే బాసింగ బలాలు అనే ఫోక్ సాంగ్‌తో వెలుగులోకి వచ్చాడు. వైష్ణవి సోనీతో కలిసి ఆయన నటిచిన ఈ పాట పెళ్లిళ్లలో, డీజే ఈవెంట్లలో మారుమోగిపోతోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ఈ పాట ఆయన కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది. ఈ వివాదంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు మరో ఫోక్ ఆర్టిస్ట్‌ది. గతంలో ఈశ్వర్ సాయి, ఆమె కలిసి చాలా జానపద గీతాల్లో నటించారు. ముఖ్యంగా రాతిరి రాతిరి రాతిరిలో పాటతోపాటు ప్రమీల వంటి సాంగ్స్‌లో వీడి జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. వృత్తిపరంగా కలిసి పని చేసిన ఈ ఇద్దరి మధ్య వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని ఆయన భార్య బహిర్గతం చేయడం చర్చనీయాంశంగా మారింది.
నా భర్త మంచోడే అంటున్న ఈశ్వర్ సాయి భార్య
ఈశ్వర్ సాయి భార్య మీడియాతో మాట్లాడుతూ తన భర్త మంచోడే అంటున్నారు. అయితే ఆ అమ్మాయే లొంగదీసుకుందని ఆరోపించారు. మీద మీద పడుతూ కవ్వించిందని అన్నారు. ఆమె తల్లితో మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయం చెప్పారని, తన కుమార్తె అలాంటిదేనని అంగీకరించారని అన్నారు. ” నా భర్త మంచోడే.. ఆమెనే మీద పడి లొంగదీసుకుంది. మాకు పెళ్లయి 7 ఏళ్లు అవుతుంది. నా భర్త కనీసం మందు కూడా తాగడు. కానీ ఆయనతో కూడా తాగేంచారు. ఆయనకు మందు అలవాటు చేశారు. ఈ అమ్మాయికి బ్రేకప్ అయితే నేనే దగ్గరుండి ఓదార్చాను. నా పక్కనే ఉంటూ నన్నే మోసం చేస్తుందని అనుకోలేదు. నా కళ్ల ముందే ఉండేది. మంచి అమ్మాయి అనుకున్నాను, కానీ మెసేజ్‌లు చూసి కంగుతిన్నాను. ఈ విషయంలో ఒకసారి నా కొడుకుతో కలిసి సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకున్నాను. కంగారుపడిన ఆమె నాకు ఫోన్ చేసి డైవర్ట్ చేసింది. దాన్ని కూడా నేను నమ్మాను. అయితే తాను సూసైడ్ చేసుకుంటే ఆమె మెడకు చుట్టుకుటుందని భయంతో ఇలా చేసిందని అర్థమైంది. నా భర్త మంచోడే కానీ అమ్మాయి మీద పడితే అతను మాత్రం ఏం చేస్తాడు? ఇలాంటి అమ్మాయిలను ఫోక్ సాంగ్స్ పరిశ్రమలోకి రానివ్వకూడదు.” అని చెప్పుకొచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular