రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
Follow road safety rules
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
తాండూర్ సబ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్
;తాండూర్
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరుతూ ట్రాఫిక్ నిబంధనలపై తాండూర్ సబ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ అవగాహన కల్పించారు.సోమవారం రోజున ఐ.బి కేంద్రంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవల్లో భాగంగా ఎస్సై మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా తమ వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను లైసెన్స్ ఇన్సూరెన్స్ తప్పకుండా కలిగి ఉండాలని తెలిపారు. అలాగే మైనర్లకు వాహనాలను ఇవ్వవద్దని నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలను నడుపవద్దని అలా చేసినట్లయితే కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఆటో డ్రైవర్లు మితిమీరి ప్రయాణికులను ఎక్కించరాదని నాలుగు చక్రాల వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలని ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్లరాదని హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు .అలాగే ఐబీ కేంద్రంలో శనివారం అంగడి బజార్ నుండి తాండూర్ బస్టాండ్ వరకు రహదారి ప్రక్కన ఉన్న దుకాణం యజమానులందరూ రోడ్డుకు అడ్డంగా వాహనాలను నిలుపకుండా చూడాలని కోరారు.శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.



