- Advertisement -
2014 తరువాత మొదటి సారిగా విదేశాల నుంచి ఎటువంటి ప్రయత్నమూ జరగలేదు
For the first time after 2014, there was no attempt from abroad
ఈ దఫా పార్లమెంట్ సెషన్ ఒక విధంగా విశిష్టమైనది
ప్రతిపక్షాల తీరుపై కూడా వ్యంగ్యోక్తులు విసిరిన ప్రదాని మోడీ
న్యూఢిల్లీ జనవరి 31
పార్లమెంట్ సెషన్ ప్రారంభం కావడానికి ముందు దేశంలో ‘అగ్గి రగిల్చేందుకు’ బహుశా 2014 తరువాత మొదటి సారిగా విదేశాల నుంచి ఎటువంటి ప్రయత్నమూ జరగలేదని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారంచెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌కు ముందు విలేకరులతో మాట్లాడిన ప్రధాని మోడీ ప్రతిపక్షాల తీరుపై కూడా వ్యంగ్యోక్తులు విసిరారు. 2014 దరిమిలా ప్రతి సెషన్‌కు ముందు ఏదో ఒక అలజడి రేకెత్తించేందుకు విదేశాల్లో కొందరు సిద్ధంగా ఉండేవారని, అటువంటి యత్నాలను ఎగసనదోసేవారికి ఇక్కడా కొరత ఉండేది కాదని ఆయన ఆరోపించారు. (బహుశా 2014 తరువాత మొదటిసారిగా పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌కు ఒకటి రెండు రోజుల ముందు విదేశాల నుంచి అగ్గి రగిల్చేందుకు ఎటువంటి యత్నమూ జరగలేదు’ అని అన్నారు. ‘విదేశాల్లో ఎక్కడ నుంచీ అగ్గి రగిల్చే యత్న ఏడీ జరగకనపోవడం గల పది సంవత్సరాల్లో మొదటిసారిగా చూస్తున్నాను’ అని ప్రధాని చెప్పారు.తన ప్రభుత్వం మూడవ విడత శనివారం తన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండడంతో, నిరుపేద, మధ్య తరగతి వర్గాలవారిని లక్ష్మీదేవి కనికరించాలని తాను ప్రార్థించినట్లు తెలియజేశారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్షాన్ని సాధించడంలో కొత్త విశ్వాసాన్ని, శక్తిని ఈ బడ్జెట్ సెషన్ ఇస్తుందనే దృఢనమ్మకాన్ని మోడీ వ్యక్తం చేశారు. సర్వతోముఖ అభివృద్ధి కోసం తన ప్రభుత్వం మూడవ విడత మిషన్ తరహాలో వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు. సృజనాత్మకత, సమ్మిళితం, పెట్టుబడి ప్రభుత్వ ఆర్థిక అజెండాను తీర్చిదిద్దాయని ఆయన తెలిపారు. ఈ సెషన్‌లో పలు చరిత్రాత్మక బిల్లులు చేపట్టనున్నట్లు, దేశ పటిష్ఠతకు సమగ్ర చర్చ అనంతరం అవి చట్టాలు కానున్నట్లు మోడీ చెప్పారు. ‘ముఖ్యంగా, మహిళలు సమాన హక్కులు పొందేందుకు, వర్గ లేదా మతవిశ్వాస ఆధారిత వివక్ష తొలగించేందుకు వీలుగా వారి సాధికారతకు ఈ సెషన్‌లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నారు’ అని ఆయన సూచించారు.ప్రతి ఎంపి, ముఖ్యంగా యువ ఎంపిలు ఈ సెషన్‌లో ‘వికసిత్ భారత్’ అజెండాకు దోహదం చేస్తారనే దృఢనమ్మకాన్ని కూడా మోడీ వ్యక్తం చేశారు. ‘సంస్కరణ, వ్యవహరణ, పరివర్తన’ మంత్రం గురించి మోడీ వక్కాణిస్తూ, శీఘ్రతర అభివృద్ధిని సాధించవలసి ఉంటుందని, సంస్కరణపైననే గరిష్ఠ స్థాయిలో ప్రాధాన్యం ఉందని చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలసి వ్యవహరించవలసి ఉంటుందని, ప్రజల భాగస్వామ్యం ద్వారా పరివర్తనను చూడవచ్చునని ఆయన సూచించారు. ‘మనది పిన్న వయస్క దేశం& ఇప్పుడు 2025 వయోవర్గంలో ఉన్న యువజనులు 45, 50 ఏళ్ల వారు అయినప్పుడు వారి అభివృద్ధి భారతదేశ అతిపెద్ద లబ్ధిదారులు అవుతారు. వారి వయో దశలో వారు విధాన నిర్ణయ వ్యవస్థలో కూర్చుంటారు& వారు గర్వంగా అభివృద్ధి చెందిన భారత్‌తో పాటు ముందుకు సాగుతారు’ అని మోడీ పేర్కొన్నారు.ఈ బడ్జెట్ సెషన్‌లో ఎంపిలు అందరూ అభివృద్ధి భారతం సంకల్పాన్ని పటిష్ఠం చేసేందుకు కృషి చేస్తారని మోడీ అన్నారు. ‘ముఖ్యంగా మన యువ ఎంపిలకు ఇది సువర్ణావకాశం, ఎందుకంటే ఇప్పుడు సభలొ మరింత చైతన్యం, భాగస్వామ్యంతో అభివృద్ధి భారత ఫలాలను వారు తమ కళ్ల ముందు చూడగలరు. అందువల్ల ఇది యువ ఎంపిలకు అమూల్య అవకాశం’ అని ప్రధాని అన్నారు. ‘మనం ఈ బడ్జెట్ సెషన్‌లో దేశం ఆశలు, ఆకాంక్షల సాఫల్యానికి కృషి చేయగలమని ఆశిస్తున్నాను’ అని మోడీ చెప్పారు. కాగా, శుక్రవారం బడ్జెట్ సెషన్ ప్రారంభానికి ముందు లోక్‌సభలో సమీకృతమైన పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదవ సారి శనివారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
- Advertisement -