- Advertisement -
హైకోర్టులో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి ఎదురుదెబ్బ
Former BRS MLA Patnam Narendra Reddy suffered a setback in the High Court
హైదరాబాద్ డిసెంబర్ 4
హైకోర్టులో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. లగచర్ల ఘటనలో రిమాండ్‌ను సవాల్ చేస్తూ నరేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు పట్నం నరేందర్‌రెడ్డి క్వాష్ పిటిషన్ కొట్టివేసింది.కాగా, లగచర్లలో ఫార్మా విలేజ్ కోసం భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ ప్రతీజ్ జైన్ పై కొందరు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఘటన వెనుక పట్నం నరేందర్ రెడ్డి హస్తం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కొండగల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యేకు జడ్జీ రిమాండ్ విధించారు. దీంతో ఆయనను పోలీసులు జైలుకు తరలించారు. ఇటీవల ఆయన రిమాండ్ గడువు ముగియడంతో మరోసారి పొడిగించింది కోర్టు. ఈ క్రమంలోనే రిమాండ్ ను సవాల్ చేస్తు వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
- Advertisement -